ఎన్నికల అనంతరం ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ తన విదేశీ పర్యటన ముగించుకుని రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి లండన్ నుండి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోని తాడేపల్లిలోని తన ఇంటికి వెళ్లనున్నారు.
ఎన్నికల అనంతరం ఈ నెల 17న సీబీఐ కోర్టు అనుమతితో కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌కు వెళ్లారు. లండన్ నుండి యూరప్ లోని కొన్ని దేశాలలో కూడా పర్యటించినట్లు తెలుస్తోంది. సుమారు రెండు వారాలకు పైగా విదేశాల్లో గడిపిన అనంతరం రాష్ట్రానికి రానున్నారు.
కాగా నిన్నటి రోజునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తన విదేశీ పర్యటన ముగించుకోని తను నివాహం ఉండే హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. కానీ ఆయన ఏ దేశం నుండి వచ్చారనే విషయం ఎవరికి తెలియదు. ఆయన రావడం రావడమే రాజకీయాలు మొదలుపెట్టారు. ఎన్నికల కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రతపై తమ నాయకులకు సూచనలు చేశారు.
బహుశా జగన్ కూడా తాడేపల్లికి చేరుకున్న తర్వాత తమ పార్టీ నేతలతో కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రతపై చర్చించే అవకాశం ఉంది. గెలుపుపై ఇరు పార్టీ నేతలు కాంఫిడెన్స్‌తో ఉన్నట్లు కనపడుతున్న కౌంటింగ్ రోజుపై మాత్రం టెన్షన్స్ కనపడుతోంది.