ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న విడుదలవుతున్న నేపథ్యంలో హీరో ఆనంద్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు.
మిడిల్ క్లాస్ మెలొడీస్ తర్వాత లాక్ డౌన్ పడింది. ఆ టైమ్ లో బేబి కథతో పాటు “గం..గం..గణేశా” స్క్రిప్ట్ కూడా నా దగ్గరకు వచ్చింది. దర్శకుడు ఉదయ్ శెట్టి పంపిన స్క్రిప్ట్ సినాప్సిస్ లో అత్యాశ, భయం, కుట్ర అనే మూడు పదాలు నన్ను అట్రాక్ట్ చేశాయి. ఈ లైన్ ఎగ్జైట్ చేసింది. యూనిక్ గా అనిపించింది.
“గం..గం..గణేశా” ఒప్పుకున్న తర్వాత షూటింగ్ డిలే అయ్యింది. నేను బేబి మూవీ కోసం ఆ క్యారెక్టర్ మేకోవర్ లో ఉండిపోయాను. అందులో నుంచి బయటకు వచ్చేందుకు కొన్ని నెలల టైమ్ పట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్, ఫిల్మ్ యూనియన్ స్ట్రైక్స్ జరగడం..ఇలాంటి వాటి వల్ల డిలేస్ అవుతూ వచ్చాయి. సెకండాఫ్ లో వినాయకుడి మండపం నేపథ్యంలో సీన్స్ ఉంటాయి. వాటికోసం ఒక సెట్ వేశాం. భారీ వర్షాలకు ఆ సెట్ పడిపోయింది. మళ్లీ ఆ సెట్ ను పునర్నిర్మించి షూటింగ్ చేశాం. దానికి కొంత టైమ్ పట్టింది.
ప్రతి ఇంటర్వ్యూలో మీరు హీరో సెంట్రిక్ మూవీస్ ఎందుకు చేయరు అని అడుగుతుంటారు. ఎందుకు చేయకూడదు అని నాకూ అనిపించింది. “గం..గం..గణేశా” కథతో ఆ ప్రయత్నం చేయొచ్చనే నమ్మకం కలిగింది. నేను గతంలో కనిపించినట్లు ఇందులో పక్కింటి కుర్రాడిలా కనిపించను. ఎనర్జిటిక్ గా ఉంటా, కామెడీ చేస్తా, ఏడవాలనిపిస్తే ఏడుస్తా…హైపర్ గా ఉంటాను. తనను తాను హీరో అనుకుంటాడు గానీ హీరోలా ప్రవర్తించడు.
కథలో ఒక పదిహేను కీలకమైన పాత్రలు ఉంటాయి. ఇటీవల ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కోసం “గం..గం..గణేశా” స్పెషల్ షోస్ వేశాం. వాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్ టైన్ అవుతూ ఎంజాయ్ చేశారు. వాళ్ల రెస్పాన్స్ చూసి మాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది.
వినాయకుడి విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది. ఆ విగ్రహం దక్కించుకోవడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్లంతా బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నవాళ్లు. ఆ విగ్రహంలో అంత విలువైనది ఏముంది. ఎవరికి విగ్రహం దక్కింది అనేది కథాంశం. మనలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే లక్షణాలు ఉంటాయి. అవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం.
హీరోగా నా మూవీస్ స్పాన్ ఒక్కసారిగా పెరిగేది కాదు. బేబితో వంద కోట్ల గ్రాసర్ అందుకున్నానని నా నెక్ట్ మూవీ అంతకంటే ఎక్కువ వసూళు చేయాలని అనుకోను. లవ్ సబ్జెక్ట్స్ యూనివర్సల్ కాబట్టి అంత రీచ్ వచ్చింది. మేము “గం..గం..గణేశా”కు ఆరేడు కోట్లు ఖర్చు పెట్టాం. ప్రమోషన్ అన్నీ కలుపుకుని పెట్టిన డబ్బులు తిరిగి వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యి, మీరంతా మంచి రివ్యూస్ ఇస్తే అదే మాకు ఎంతో స్ట్రెంత్, సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఈ సమ్మర్ లో ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు రాలేదు. “గం..గం..గణేశా” ఆ కొరత తీర్చుతుంది. ఈ సినిమాతో నూటికి నూరు శాతం వినోదం గ్యారంటీ.