అవార్డ్ విన్నింగ్ కాంబినేషన్ విడిపోయింది

సూర్య, సుధా కొంగర.. ఈ కాంబినేషన్ కు ఓ క్రేజ్ ఉంది. వీళ్ల కాంబోలో వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా సైలెంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు, సూర్యకు జాతీయ అవార్డ్…

సూర్య, సుధా కొంగర.. ఈ కాంబినేషన్ కు ఓ క్రేజ్ ఉంది. వీళ్ల కాంబోలో వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా సైలెంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు, సూర్యకు జాతీయ అవార్డ్ తెచ్చిపెట్టింది. ఇలాంటి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోందంటూ 2 నెలల కిందట ప్రకటన వచ్చింది.

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో సినిమా చేయబోతున్నాడని, ఈసారి మరింత వినూత్నమైన కథతో, విభిన్నమైన గెటప్ తో సూర్య అలరించబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడీ సినిమా ఆగిపోయింది.

అధికారికంగా ప్రకటన రానప్పటికీ.. వీళ్లిద్దరి వ్యవహార శైలి చూస్తుంటే, సినిమా ఆగిపోయిందనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు సూర్య. ఓ 3 రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. కార్తీక్ తో సినిమా ఎనౌన్స్ చేయబోతున్నాడట సూర్య. ఆ ఎనౌన్స్ మెంట్ వీడియో కోసమే 3 రోజులు షూట్ చేసినట్టు తెలుస్తోంది.

అటు సుధా కొంగర కూడా సూర్యతో చేయాల్సిన సినిమా గురించి మాట్లాడ్డం లేదు. ఆమె ఓ కొత్త కథతో శింబు, విక్రమ్, శివకార్తికేయన్ ను సంప్రదించింది. వీళ్లలో శివ కార్తికేయన్ తో సినిమాను ఆమె దాదాపు లాక్ చేసింది.

ఈ పరిణామాలు చూస్తుంటే, సూర్య, సుధా కొంగర కాంబినేషన్ లో సినిమా రాదనేది పక్కా. క్రియేటివ్ డిఫరెన్సెన్స్ కారణంగానే ఈ సినిమా ఆగిపోయినట్టు కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.