ఫుల్లుగా నవ్వుకున్న ప్రభాస్-ప్రశాంత్

ఉన్నట్టుండి సడెన్ గా సలార్ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ విడుదలైంది. ఆ ఫొటోలో హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫుల్ గా నవ్వుకుంటున్నారు. ‘వాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు’ అనే క్యాప్షన్ ను…

ఉన్నట్టుండి సడెన్ గా సలార్ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ విడుదలైంది. ఆ ఫొటోలో హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫుల్ గా నవ్వుకుంటున్నారు. ‘వాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు’ అనే క్యాప్షన్ ను తగిలించారు. అంతకుమించి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే ఉన్నఫలంగా ఈ ఫొటో రిలీజ్ చేయడం వెనక ఓ స్టోరీ ఉంది.

రీసెంట్ గా సలార్-2 పై చాలా ఊహాగానాలు చెలరేగాయి. కొన్ని మీడియా సంస్థలు, సలార్-2 ఆగిపోయినట్టు కథనాలు ప్రసారం/ప్రచురితం చేశాయి. ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనని, ఆ కథనాలు చూసి నవ్వొచ్చిందనే అర్థం వచ్చేలా ఈ ఫొటో రిలీజ్ చేసినట్టు కనిపిస్తోంది.

ఆ పుకార్లు రావడానికి ఓ కారణం ఉంది. రీసెంట్ గా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా అప్ డేట్ వచ్చింది. ఆగస్ట్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన చేసింది. అదే కనుక జరిగితే సలార్-2 పక్కకెళ్లిపోతుందని చాలామంది భావించారు. ఆ ఊహాగానాల్ని తాజా ఫొటోతో యూనిట్ ఖండించింది.

లెక్కప్రకారం, ఈ పాటికి సలార్-2 సెట్స్ పైకి రావాల్సి ఉంది. మే చివరి వారం నుంచి తాము సెట్స్ పైకి వెళ్తామని పృధ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహా ఇద్దరూ ప్రకటించారు. అయితే అలా జరగలేదు. వాళ్లు నవ్వుకుంటున్నారంటూ రిలీజ్ చేసిన ఫొటోతో పాటు.. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ ఇస్తే బాగుండేది.