లవ్ మౌళి- ఓ కొత్త కోణం

నటుడు, హీరో నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్ మౌళి. చిరకాలంగా జరుగుతున్న ప్రచారం ఈ సినిమాకు కొంత వరకు బజ్ ను తీసుకువచ్చింది.ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి…

నటుడు, హీరో నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్ మౌళి. చిరకాలంగా జరుగుతున్న ప్రచారం ఈ సినిమాకు కొంత వరకు బజ్ ను తీసుకువచ్చింది.ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ కలిసి నిర్మించాయి. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 7న విడుద‌ల చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో హీరో న‌వ‌దీప్ మాట్లాడుతూ అన్ని భాషల్లో ర‌క‌ర‌కాల కొత్త కంటెంట్‌తో సినిమాలు వ‌స్తున్నాయి. అదే కోవ‌లో తెలుగులో రాబోతున్న వైవిధ్య‌మైన‌, విభిన్న‌మైన సినిమా ఇది. ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్‌కు ర‌ప్పించే సినిమా ఇది. ఆడియన్స్‌కు థియేట‌ర్‌కు ఎందుకు రావాలో అన్న ప్ర‌శ్న‌కు ఈ చిత్రంలో స‌మాధానం దొరుకుతుంది. చిరపుంజి, మేఘాల‌యాలోని అంద‌ర‌మైన ప్ర‌దేశాల్లో షూట్ చేసిన చిత్ర‌మిది. ఈ క‌థ విన్న‌ప్పుడు అక్క‌డే చేయాల‌ని అనిపించింది. ఎన్నో వ్య‌య ప్ర‌య‌సాల‌తో చిత్రీక‌ర‌ణ చేశాం.

అసలు ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్ ఎలా జ‌రిగింది అనే దాని మీద ఓ సినిమా తీయ్యెచ్చు. మంచి బ్యూటిఫుల్ సినిమా తీశామ‌నే న‌మ్మ‌కం క‌లిగింది. ఇక సినిమా ఫ‌లితం ఆడియ‌న్స్ చేతిలో వుంది క‌థ విన‌గానే న‌చ్చిన సినిమా ఇది. నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో నా ప్రేమ‌క‌థ‌లు, నా ల‌వ్‌స్టోరీల్లో వున్న పాయింట్‌ను ట‌చ్ చేశాం. ఈ క‌థ, ఈ పాయింట్ క‌నెక్ట్ అయితే వాళ్ల ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు వ‌స్తాయో చూడాల‌ని వుంది. ఈ 20 ఏళ్ల కెరీర్ త‌రువాత నాలో వున్న కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తూ చేసిన సినిమా ఇది.

ద‌ర్శ‌కుడు అవ‌నీంద్ర మాట్లాడుతూ ఇందులో నేటి యువ‌త‌రానికి కావాల్సిన అంశాలున్నాయి. ఈ చిత్రంలో అంద‌రికి రిలేట్ అయ్యే అంశాలు, క‌నెక్ట్ అయ్యే అంశాలున్నాయి. ప్రేమ‌లో వున్న వారి రిలేష‌న్స్ ఎలా వున్నాయి. నేటి యువ‌త‌రం ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్రేక‌ప్‌లు అవుతున్నాయి. కాంప్ర‌మైజ్ అయితే త‌ప్ప రిలేష‌న్స్ నిల‌బ‌డ‌వా? అనే ప్ర‌శ్న‌కు ప‌రిష్కారాన్ని కూడా ఈ చిత్రంలో చూపెడుతున్నాం. విడుద‌లైన త‌రువాత కూడా అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమా కోసం న‌వ‌దీప్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఆయ‌న అందుకు త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంద‌నే నమ్మ‌కం వుంది అన్నారు.