కీలక పాత్రలు కాదు.. కథానాయిక పాత్రలు

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. నేహా శెట్టి హీరోయిన్, అంజలి కీలక పాత్ర. గేమ్ చేంజర్.. కియరా అద్వానీ హీరోయిన్, కీలక పాత్రలో అంజలి. ఇన్నాళ్లూ అందరూ ఇలానే చెప్పుకొచ్చారు, జనాలు కూడా ఇదే ఫిక్స్…

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. నేహా శెట్టి హీరోయిన్, అంజలి కీలక పాత్ర. గేమ్ చేంజర్.. కియరా అద్వానీ హీరోయిన్, కీలక పాత్రలో అంజలి. ఇన్నాళ్లూ అందరూ ఇలానే చెప్పుకొచ్చారు, జనాలు కూడా ఇదే ఫిక్స్ అయ్యారు. అంజలి మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు.

తనది స్పెషల్ రోల్స్ కాదంటోంది అంజలి. తను చేస్తున్నవన్నీ హీరోయిన్ రోల్స్ అని చెబుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నేహా శెట్టి ఓ హీరోయిన్ అయితే, తను మరో హీరోయిన్ పాత్ర పోషించానని అంటోంది. అంతే తప్ప, తనది కీలక పాత్ర లేదా స్పెషల్ రోల్ కాదంటోంది.

గేమ్ ఛేంజర్ విషయంలో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది అంజలి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని, అందులో తను ఒక హీరోయిన్ అని అంటోంది. కాబట్టి తను హీరోయిన్ పాత్రలు మాత్రమే చేస్తానని, స్పెషల్ రోల్స్ చేయనని అంటోంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ తో కలిసి నటించిన అంజలి, అతడితో తనకు చాన్నాళ్లుగా స్నేహం ఉందని, అందుకే సినిమాలో తమ కెమిస్ట్రీ బాగా కుదిరిందని అంటోంది.

సినిమాలో ఇద్దరి పేర్లు ఒకటేనంట. విశ్వక్ సేన్ పాత్ర పేరు రత్నాకర్ అయితే, అంజలి పాత్ర పేరు రత్నమాల. ఇద్దర్నీ రత్న అనే పిలుస్తారంట.