ప్రాజెక్ట్ కె.. లేదా కల్కి.. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. బాహుబలి తరువాత ఆ రేంజ్ లో ప్రభాస్ కు హిట్ పడుతుందని అంతా అనుకుంటున్న సినిమా. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారు ను రేపు పరిచయం చేసోంది యూనిట్.
రామోజీ ఫిలిం సిటీలో అత్యంత భారీగా జరిగే ఫంక్షన్ లో ఈ కారు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. దేశ, విదేశీ నిపుణులు అంతా కలిసి నాగ్ అశ్విన్ ఊహకు ప్రాణం పోసి తయారు చేసారు దీన్ని.
ఈ కారు చేసే విన్యాసాలు సినిమాలో చాలా వుంటాయని తెలుస్తోంది. ఈ కారు గాల్లోకి ఎగురుతుందని తెలుస్తోంది. ఈ కారు నిర్మాణానికి సినిమా యూనిట్ ఏడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇదే సినిమాలో హీరో ప్రభాస్ ధరించే జాకెట్ ఒకటి వుంటుంది. అది కూడా అనేక వింతలతో కూడుకున్నది అని తెలుస్తోంది. ఈ జాకెట్ నుంచి బుల్లెట్లు కూడా కురుస్తాయట. ఈ జాకెట్ తయారీకి రెండు కోట్ల వరకు ఖర్చు చేసారట.
ఇన్నేసి కోట్లు ఖర్చు చేయడం అంటే అసలు ఆ వర్కింగ్ మోడల్స్ ను తయారు చేయడం కోసం అన్నమాట. అదే కనుక మామూలుగా తయారుచేసి, సిజి వర్క్ తో మేనేజ్ చేస్తే అది వేరుగా వుంటుంది. ప్రాజెక్ట్ కె అన్నది దర్శకుడు నాగ్ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా మార్కెట్ చేస్తున్నారు.