శ్రీకాకుళం జిల్లాలో ఆయన తిరుగులేని నాయకుడు. ఆయనే శ్రీకాకుళంలో పేరు గడించిన రాజకీయ కుటుంబమైన ధర్మాన ప్రసాదరావు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన అదే టెర్మ్ లో యువ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్సార్ కి ప్రధాన అనుచరుడిగా ఉంటూ 2004 నుంచి 2009 వరకూ కీలకమైన పలు మంత్రిత్వ శాఖలు చేసిన ఘనత ఆయనదే.
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన క్రెడిట్ ధర్మానదే. ఆయన ఇప్పటికి అనేక సార్లు మంత్రిగా ఎమ్మెల్యేగా చేసారు. 2024 తనకు చివరి ఎన్నికలు అంటూ పోటీకి నిలిచారు. వైసీపీలో రెవిన్యూ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మానకు ఈసారి గాలి అనుకూలంగానే ఉందని సర్వే నివేదికలు చెబుతున్నాయి. అంచనాలు అలాగే ఉన్నాయి.
మరో మారు గెలిస్తే మా నేత కీలకమైన బాధ్యతలను చేపడతారు అని అభిమాన జనం అంతా చేరి మంత్రి గారి పుట్టిన రోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ మరో సారి అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని అవుతుందని అలా వెనకబడిన శ్రీకాకుళం జిల్లాకు పూర్తి న్యాయం జరుగుతుందని గాఢంగా నమ్మే ధర్మాన ఈసారి కూడా ఏపీలో ఫ్యాన్ గాలి భారీగా వీస్తుందనే నమ్ముతున్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేకించి శ్రీకాకుళం ప్రగతికి కట్టుబడిన ధర్మాన ఫలితాల కంటే ముందే పుట్టారు. ఈసారి వైసీపీకి శుభ ఫలితాలు రావాలని ఆయనతో పాటు అంతా కోరుకుంటున్నారు. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ధర్మాన కుటుంబానికి ఈ ఎన్నికలు అతి ముఖ్యమైనవిగా మారాయి. ఇవి ఉత్తరాంధ్రకు కూడా చాలా కీలకం అని ధర్మాన అంటున్నారు. పుట్టిన రోజున అందిన అభినందనలు ఆశీస్సులు వైసీపీకీ తనకూ ఆనందాలే ఇస్తాయని ధర్మాన నమ్ముతున్నారు.