మొన్న కోవీషీల్డ్.. ఇప్పుడు కోవాక్సిన్

మొన్నటికిమొన్న కోవీషీల్డ్ ప్రకంపనలు సృష్టించింది. తమ కంపెనీ తయారుచేసిన కొవీషీల్డ్ వ్యాక్సిన్, సైడ్ ఎఫెక్టులు కలిగిస్తుందని ఆస్ట్రాజెనికా కంపెనీ తొలిసారి అంగీకరించిన సంగతి తెలిసిందే. కొవీషీల్డ్ తీసుకున్నవాళ్లలో కొంతమందికి  రక్తం గడ్డకడుతుందని, మరికొందరికి తెల్ల…

మొన్నటికిమొన్న కోవీషీల్డ్ ప్రకంపనలు సృష్టించింది. తమ కంపెనీ తయారుచేసిన కొవీషీల్డ్ వ్యాక్సిన్, సైడ్ ఎఫెక్టులు కలిగిస్తుందని ఆస్ట్రాజెనికా కంపెనీ తొలిసారి అంగీకరించిన సంగతి తెలిసిందే. కొవీషీల్డ్ తీసుకున్నవాళ్లలో కొంతమందికి  రక్తం గడ్డకడుతుందని, మరికొందరికి తెల్ల రక్తకణాలు (ప్లేట్ లెట్స్) సంస్థ గణనీయంగా తగ్గిపోతుందని ప్రకటించి అందరికీ షాకిచ్చింది సదరు కంపెనీ.

ఈ మేటర్ బయటకురాగానే కోవీషీల్డ్ పై నెగెటివ్ గా చాలా పోస్టులు పడ్డాయి. అదే టైమ్ లో కోవాక్సిన్ గ్రహీతంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు కోవాక్సిన గ్రహీతలకు షాకింగ్ న్యూస్.

కోవాక్సిన్ తో సైడ్ ఎఫెక్టులు ఉన్నట్టు బెనారస్ హిందూ యూనివర్సిటీ గుర్తించింది. 637 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలపై ఏడాది పాటు ఈ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. వీరిలో 304 మంది టీనేజర్లు, 124 మంది పెద్దల్లో శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమైనట్టు గుర్తించారు. మొత్తం అధ్యయం చేసిన వాళ్ల సంఖ్యలో ఇది దాదాపు 46శాతం.

ఇక మహిళల విషయానికొస్తే, 4.6 శాతం మంది మహిళల్లో రుతుక్రమం సమస్యలు, 2.7 శాతం మందిలో కంటి చూపు సమస్యలు తలెత్తినట్టు యూనివర్సిటీ గుర్తించింది.

ఓవరాల్ గా 10శాతం మంది కంటే ఎక్కువమందిలో చర్మవ్యాధులు తలెత్తాయని పరిశోధకులు తేల్చారు. 4.7 శాతం మంది నరాలకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు.

వీళ్లలో నలుగురు మరణించారు. మృతి చెందిన వాళ్లందరికీ షుగర్, బీపీ ఉన్నాయి. వీళ్లలో ఇద్దరికి వాక్సిన్ తీసుకోకముందు నుంచే షుగర్, బీపీ ఉండగా.. ఇద్దరికి మాత్రం వ్యాక్సిన్ తర్వాత వచ్చింది. భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ ను అభివృద్ధి చేసింది.