రాను రాను కొత్త లెక్కలు

పోలింగ్ ఉదయాన్నే – భారీ గా లైన్లలో జనాలు. కూటమి గెలుస్తోంది అంటూ వార్తలు, ట్వీట్ లు, పోస్ట్ లు. Advertisement పోలింగ్ మధ్యాహ్నం వేళకు – మహిళలు, వృద్దులు లైన్ లో ఎక్కువగా…

పోలింగ్ ఉదయాన్నే – భారీ గా లైన్లలో జనాలు. కూటమి గెలుస్తోంది అంటూ వార్తలు, ట్వీట్ లు, పోస్ట్ లు.

పోలింగ్ మధ్యాహ్నం వేళకు – మహిళలు, వృద్దులు లైన్ లో ఎక్కువగా వున్నారు. అంత సులువుగా వైకాపా ను తీసేయలేము.

పోలింగ్ మర్నాడు – ఎనభై శాతం దాటేసింది పోలింగ్. ఇలా అయితే అధికార పక్షానికి కష్టమే. ఇది చరిత్ర చెబుతున్న విషయం.

ఆ తరువాత ఓటమి భయంలో అధికారపక్షం దాడులు చేస్తోంది – తెలుగుదేశం అను కుల మీడియా.

మా పార్టీ జనాలు వైకాపా వాళ్లను ఉరికించి, ఉరికించి కొడుతున్నారు,, సూపర్.. తెలుగుదేశం సోషల్ మీడియా హ్యాండిళ్లు.

ఇప్పుడు లేటెస్ట్ గా బెట్టింగ్ ట్రెండ్ లు కూడా మారుతున్నాయి.

అస్సలు అడుగుపెట్టలేరు ఈసారి అనుకున్న తూర్పుగోదావరి మొత్తం మీద ఏడు వరకు వస్తాయి వైకాపాకు అనే లెక్కలు మొదలయ్యాయి.

విశాఖ సిటీలో మూడు కనీసం వైకాపాకు వస్తాయి. అయిదు వరకు చాన్స్ వుంది అనే మాట వినిపించడం మొదలైంది.

ఓటు బ్యాలెట్ లోకి వెళ్లిపోయిన తరువాత లెక్కలు కొంతవరకు అందుతాయి. అయితే ఈసారి ఎగ్జిట్ పోల్స్ మీద బ్యాన్ వుంది. అందువల్ల రకరకాల ఫేక్ సర్వేలు బయటకు వస్తున్నాయి. వీటిని పట్టుకుని బెట్టింగ్ బంగార్రాజులు ఎగబడతారని. కానీ గమ్మత్తేమిటంటే ఇలా బయటకు వస్తున్న పోల్స్ అన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వున్నా కూడ వైకాపా జనాలు తాము సైతం బెట్టింగ్ కు రెడీ అనడం.

కూటమి వచ్చేస్తుందనో, జగన్ గెలుస్తాడనో చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశం. ఎన్నికల రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే జనాల వాయిస్ ఇలా రకరకాలుగా ఎందుకు మారుతోంది అన్నదే పాయింట్. జగన్ నో, చంద్రబాబునో పార్టీ శ్రేణులను ఉత్సాహ పర్చడానికి ఏమైనా మాట్లాడ వచ్చు. ఎంతయినా చెప్పచ్చు.

కానీ కింద వుండే కేడర్ కు అసలు సిసలు క్లారిటీ వుంటుంది. ఆ క్లారిటీ ఎందుకు రోజు రోజుకు మారుతోంది అన్నది క్వశ్చను?