దిల్ రాజు అంటే టచ్ చేస్తే బ్లాక్ బస్టర్. టాలెంట్ ను పట్టుకోవడంలో అయినా, పట్టుకున్న టాలెంట్ ను సానపెట్డడంలో అయినా. అయితే కొన్నాళ్లుగా ఈ మిడాస్ టచ్ మాయమైనట్లు కనిపిస్తోంది.
తన స్టయిల్ లో మెరుపులు మెరిపించి, అందంగా మార్చాలన్న ఆయన ప్రయత్నాలు ఎందుకో బెడిసికొడుతున్నాయి. తన ఇంటి వారసుడు ఆశిష్ తో లేటెస్ట్ గా చేసిన సినిమా లవ్ మీ. దెయ్యాన్ని మనిషి ప్రేమించడం అన్నది కాన్సెప్ట్. కాన్సెప్ట్ బాగుంది. అందువల్ల దిల్ రాజు టేకప్ చేసి వుండొచ్చు. ఈ సినిమా ఈ నెల 25 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రయిలర్ ను విడుదల చేసారు.
ట్రయిలర్ చూస్తుంటే మాత్రం దిల్ రాజు మిడాస్ టచ్ మాయం అయిందన్న పీల్ కలుగుతోంది. ట్రయిలర్ కట్ ఆశించినంత మేరకు అయితే లేదు. దీనికి కారణం ట్రయిలర్ కట్ కాదు. ట్రయిలర్ కట్ ను బాగానే ట్రయ్ చేసారు. సబ్జెక్ట్ లో మిస్టరీ విషయాలు అన్నీ ట్రయిలర్ లోకి తెచ్చి ఆసక్తి కొంత వరకు పెంచారు. కానీ హీరో ఆశిష్ డైలాగ్ మాడ్యులేషన్ ఏమిటోగా వుంది. సినిమా మొత్తం మీద చూస్తే ఎలా వుంటుందో కానీ ట్రయిలర్ లో మాత్రం ఆశిష్ నే వీక్ పాయింట్ అనేట్లు వుంది.
ట్రయిలర్ కూడా ఆశిష్ మీద ఫోకస్ చేస్తూనే, సబ్జెక్ట్, మిగిలిన నటులు అందరినీ తీసుకువచ్చి, ఈ లోపాన్ని కవర్ చేయడానికి ప్రయత్నించినట్లు వుంది. ఎమోషనల్ సీన్ ఒకటి కట్ చేసారు ట్రయలర్ లో. అక్కడ మాత్రం బాగుంది ఆశిష్ వర్క్.
మరి మిగిలిన చోట్ల డైలాగులు అలా ఎందుకు చెప్పించారో చూడాలి. సినిమాకు అసలు అట్రాక్షన్ బేబీ హీరోయిన్ వైష్ణవి. ఆమె జస్ట్ ఓకె. ట్రయిలర్ లో ఆకట్టుకునేది, మలిసగంలో పరుచుకున్న సబ్జెక్ట్. మిస్టరీ, హర్రర్ జానర్ లో సాగిన ఈ సబ్జెక్ట్ మాత్రం ఇంట్రస్టింగ్ గా వుంది. పిసి శ్రీరామ్, కీరవాణి లాంటి టాప్ టెక్నీషియన్లు పని చేసారు. ఆ వర్క్ అంతా చూడాలంటే సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే.
ట్రయిలర్ లో ఎలా వున్నా, సినిమాలో మాత్రం హీరో ఆశిష్ ప్రూవ్ చేసుకుంటాడని ఆశిద్దాం.