‘దేశం’ అలా.. సోషల్ మీడియా ఇలా

చిత్రంగా వుంది వ్యవహారం. ఎన్నికల అనంతరం జరుగుతున్న దాడులకు వైకాపా కారణం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు నానా యాగీ చేస్తున్నారు. గమ్మత్తేమిటంటే అదే సమయంలో తెలుగుదేశం సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం రివర్స్…

చిత్రంగా వుంది వ్యవహారం. ఎన్నికల అనంతరం జరుగుతున్న దాడులకు వైకాపా కారణం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు నానా యాగీ చేస్తున్నారు. గమ్మత్తేమిటంటే అదే సమయంలో తెలుగుదేశం సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం రివర్స్ లో ప్రచారం చేసి హ్యాపీ అవుతున్నాయి.

తెలుగుదేశం జనాలే వైకాపా జనాలను, ఎమ్మెల్యేలను తరిమి తరిమి కొడుతున్నట్లు పేర్కొంటూ.. సూపర్ అంటూ ఆనందం పొందుతున్నాయి. ఇంకా గమ్మత్తేమిటంటే ఇటు పార్టీ, అటు పార్టీ సోషల్ మీడియా మద్దతు దారులు షేర్ చేస్తున్న వీడియోలు ఒకటే కావడం.

అంటే ఏది నిజం అనుకోవాలి? ఈ దాడుల వెనుక వైకాపా వుందనుకోవాలా? లేదా తేదేపా వుందనుకోవాలా? అంటే తేదేపా దాడులు చేస్తూ, అంతా వైకాపా చేస్తోందని ఎదురు దాడికి దిగుతోంది. కానీ పార్టీ శ్రేణులు మాత్రం అదంతా తమ పార్టీ ఘనత అంటూ పొంగిపోతున్నాయి. అది అసలు వాస్తవం అన్న మాట.

ఒక పక్క దాడులు చేస్తూ, ఇది వైకాపా పని అని నెగిటివ్ ప్రాపగండా చేస్తున్నారు. కానీ ఇది చాలా సూపర్ అంటూ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీది ఇదే వైఖరి. మొగుడ్ని కొట్టి మొగసాల ఎక్కే టైపు. చేసేది అంతా తాము చేసేస్తారు. కానీ బురద మాత్రం అవతలివారి పై వేస్తారు.