రీసెంట్ గా దుబాయ్ వెళ్లొచ్చాడు ఎన్టీఆర్. తన కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని రోజుల పాటు గడిపి వచ్చాడు. ఇప్పుడు మరోసారి విదేశాల బాట పట్టాడు తారక్. ఈసారి తారక్ పుట్టినరోజు స్పెషల్.
మరికొన్ని రోజుల్లో తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఈ పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేటుగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే మరోసారి విదేశాలకు వెళ్లాడు. ఈసారి తారక్ ఏ దేశంలో ల్యాండ్ అయ్యాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఎన్టీఆర్ బర్త్ డేకి ఈసారి చాలా హంగామా ఉంది. దేవర పార్ట్-1 నుంచి, తొలి బాలీవుడ్ మూవీ వార్-2 నుంచి అప్ డేట్స్ రాబోతున్నాయి. వీటితో పాటు కొత్త సినిమా ప్రకటన కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఇలా ఫ్యాన్స్ అంతా తమ హీరో బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతుంటే, తారక్ విదేశాల్లో తన పుట్టినరోజును ప్లాన్ చేశాడు. విహారయాత్ర నుంచి తిరిగొచ్చిన తర్వాత తిరిగి దేవర-1, వార్-2ను స్టార్ట్ చేస్తాడు.