విశాఖ అపోజిషన్ లోనా?

విశాఖపట్నం అపొజిషన్ లో ఉంటుందా లేక అధికారంలోకి వస్తుందా. దీని మీద ఎడతెగని చర్చ సాగుతోంది. విశాఖ సిటీలోని నాలుగు సీట్ల మీద హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తరం,…

విశాఖపట్నం అపొజిషన్ లో ఉంటుందా లేక అధికారంలోకి వస్తుందా. దీని మీద ఎడతెగని చర్చ సాగుతోంది. విశాఖ సిటీలోని నాలుగు సీట్ల మీద హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ దిక్కుని చూపిస్తున్నాయని అభ్యర్ధులతో పాటు ఓటేసిన ప్రజలు కూడా ఆత్రంగా చూస్తున్నారు.

విశాఖ నుంచి ఈ నాలుగు సీట్లలో 2019లో గెలిచిన టీడీపీ అపోజిషన్ లోకి వెళ్ళిపోయిది. 151 సీట్లతో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో సిటీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మంత్రి పదవికి నోచుకోకుండా పోయింది. దీని కంటే ముందు 2009లో వైఎస్సార్ రెండవసారి అధికారంలోకి వచ్చినపుడు కూడా విశాఖ సిటీలో తూర్పు  నియోజకవర్గం టీడీపీ గెలిచింది, అలా తూర్పు దిక్కునే చూస్తూ ఉండిపోయింది.

ఈ పరిణామాలు అన్నీ తలచుకుంటున్న వారు ఈసారి సిటీలో ఎవరిది పాగా అని ఆసక్తికరమైన చర్చకు తెర తీస్తున్నారు. విశాఖ సిటీలో ఈసారి వైసీపీకి టీడీపీకి రెండింటికీ పోటా పోటీగా పోరు సాగింది. రెండు పార్టీలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు.

అయితే ఈసారి విశాఖలో గెలిచిన పార్టీనే అధికారంలో ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. విశాఖ ఏపీలో మెగా సిటీ. గ్రోత్ ఇంజన్. విశాఖ అభివృద్ధి సాగాలంటే సిటీ నుంచి మంత్రి ఉండాలని అంతా బలంగా కోరుకుంటున్నారు. ఓటర్లు అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చి తీర్పు చెప్పారు. ఆ తీర్పు వైసీపీకి లేక టీడీపీకి ఎవరికి అనుకూలంగా ఉంటుంది అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. విశాఖ పొజిషన్ ఏమిటి అన్న దానిపైన కూడా సెటైరికల్ గా డిస్కషన్ అయితే ఉంది.