డబుల్ ఇస్మార్ట్ టీజర్ అనౌన్స్ మెంట్ వచ్చింది. 85 సెకెండ్ల టీజర్ అని టైమ్ కూడా చెప్పేసారు. పూరి టీజర్ ఎలా వుంటుందో కొత్తగా చెప్పనక్కరలేదు. పంచ్ డైలాగులు పేలడం ఫిక్స్. దానికి తగినట్లే హీరో రామ్ వెర్సటాలిటీ, లుక్స్ అన్నీ వుంటాయి. అందువల్ల అటు రామ్ ఫ్యాన్స్ కు ఇటు పూరి ఫ్యాన్స్ కు చాలా ఆతృతగా వుంది. బ్లాక్ బస్టర్ సీక్వెల్ కావడం, రామ్ కు సరైన సినిమా పడి చాలా గ్యాప్ రావడం వల్ల ఈ ఆసక్తి మరింత పెరిగింది. సంజయ్ దత్ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్న సినిమా ఇది.
అందువల్ల ఇక డబుల్ ఇస్మార్ట్ హడావుడి ఇక మొదలవుతుంది. అంతవరకు బాగానే వుంది. కానీ డబుల్ ఇస్మార్ట్ మీద లైగర్ కష్టాల ప్రభావం వుంటుంది. లైగర్ కు సంబంధించి పూరి- చార్మి బ్యానర్ మీద ఫిర్యాదులు వున్నాయి. తేల్చాల్సిన లెక్కలు వున్నాయి. అవన్నీ తేలకుండా సినిమా మార్కెట్ అంత ఈజీ కాదు. అటు వరంగల్ శ్రీను, ఇటు శోభన్, చదలవాడ ఇలా చాలా మంది డబుల్ ఇస్మార్ట్ విడుదల టైమ్ కోసం చూస్తున్నారు. నైజాం ఎగ్జిబిటర్లు ఆసియన్ సునీల్, శిరీష్ సరేసరి.
సో ఇప్పుడు సినిమా పూర్తి చేయడంతో పాట, ఈ పంచాయతీలు అన్నీ తేల్చుకోవాల్సిన బాధ్యత పూరి- చార్మిల మీద వుంది. ఇప్పటి వరకు అంటే సినిమా విడుదలకు రాలేదు కనుక, ముంబాయిలో వుండిపోయినా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడకు రావాల్సిందే, చాంబర్ లోనో, కౌన్సిల్ లోనో పంచాయతీలు పడాల్సిందే.