బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఓ బ్లాక్ బస్టర్. కానీ అదే షో సీజన్ 2 పెద్దగా క్లిక్ కాలేదు. స్పెషల్ ఎపిసొడ్‌లు అంటూ ఏదో హడావుడి చేస్తున్నారు తప్ప అవి కూడా పెద్ద క్లిక్ కావడం లేదు. ఒక విధంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ల్లో ఫైనల్ ఎపిసోడ్ రాబోతోంది. యనిమల్ టీమ్ తో చేసిన ప్రమోషనల్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ అది.
ఓటిటి సంస్థల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. ఇంటర్నేషన్ బ్యాకింగ్ వున్న సంస్థలు ఎదో అలా కిందా మీదా పడుతూ బండిలాగిస్తూ వస్తున్నాయి. ఆహో పూర్తిగా లోకల్ సంస్థ. ఆహా ఒక రూట్ లో వెళ్తూ వుండిపోవడం లేదు. ఆరంభంలో స్వంత కంటెంట్ ను క్రియేట్ చేయించుకుంటూ, సినిమాలు కొంటూ వెళ్లింది. తరువాత స్వంత కంటెంట్ లో మార్పులు చేసి, గేమ్ షో లు, చాట్ షో ల మీద ఆధార పడింది. ఇలాంటి టైమ్ లో సినిమాలు తగ్గాయి. కానీ జారిపోతోంది అనుకున్న టైమ్ లో బాలయ్య అన్ స్టాపబుల్ ఆదుకుంది. మాంచి ఊపు వచ్చింది. తరువాత తరువాత ఆ ఊపు మాయం అవుతూ వస్తోంది.
ప్రస్తుతానికి వున్న చందాదారుల వరకు ఓకె. కానీ కొత్తగా జాయిన్ కావాలంటే అనే ప్రశ్నకు ఉత్సాహకరమైన సమాధానం కనిపించడం లేదు. అన్ స్టాపబుల్ ను ఇక కొనసాగించడం కష్టం. కేవలం సినిమా ప్రమోషన్ల ఎపిసోడ్ లతో ఊపు రాదు. వేరేవి ప్రయత్నిద్దాం అనుకుంటే బాలయ్య కు, మిగిలిన వారికి సెట్ కావడం అన్నది చాలా కష్టం గా వుందని తెలుస్తోంది.
నిజానికి డిజిటల్ రైట్స్ విషయంలో పస్తుతం కాస్త డోలాయమాన పరిస్థితి నెలకొంది. పెద్ద సంస్థలు ఏవీ అంత రేట్లు ఇవ్వడం లేదు. అంత ఉత్సాహంగా ముందుకూ రావడం లేదు. నిజానికి ఈ పరిస్థితిని ఆహా అంది పుచ్చుకోవచ్చు. కానీ అలా చేయాలంటే కోట్ల కొద్దీ పెట్టుబడి పెట్టాల్సి వుంటుంది. కొత్తగా పెట్టుబడులకు ఆహా అంత సుముఖంగా వున్నట్లు కనిపించడం లేదు. స్పాన్సర్లు, ఇన్ హౌస్ ప్రకటనలు, కంటెంట్ మీద ప్రకటనలు ఇలా రకరకాల మార్కెటింగ్ ద్వారా నిర్వహణ ఖర్చులు రాబడుతున్నట్లు కనిపిస్తోంది.
ఒకప్పుడు అల్లు అరవింద్ చాలా యాక్టివ్ గా ఆహా మీద వర్క్ చేసారు. ఇప్పుడు అంతగా చేస్తున్నట్లు కనిపించడం లేదు. అందువల్ల ఆహా లో మళ్లీ మంచి ప్రోగ్రామ్ లు చూడడానికి కాస్త టైమ్ పట్టేలా వుంది.