దర్శకుడు విఐ ఆనంద్ రూపొందించిన ఊరి పేరు భైరవకోన సినిమా ఇప్పట్లో థియేటర్ లోకి వచ్చేలా కనిపించడం లేదు. డిసెంబర్ నుంచి వరుసగా సినిమాలు తాకిడి మామూలుగా లేదు. ఇలాంటి టైమ్ లో అటు ఇటు కాని సినిమాను విడుదల చేయడం అంటే అంత సులువు కాదు.
అటు ఇటు కానీ అంటే, అటు చిన్న సినిమా కాదు. ఇటు పెద్ద సినిమా కాదు. దాదాపు పాతిక కోట్ల మేరకు ఖర్చయింది ఈ సినిమా. సందీష్ కిషన్ మీద అంత ఖర్చు చేయలేదు. దర్శకుడిని, కంటెంట్ ను నమ్మి చేసేసారు. కానీ ఇప్పుడు థియేటర్ నుంచి మంచి మొత్తాలు రాబట్టాలంటే మాత్రం సందీప్ కిషన్ సినిమా అంటున్నారు.
మరోపక్క భోళాశంకర్ కష్టాలు కూడా భైరవ కోన మీదే పడుతున్నాయి. ఆ సినిమా మీద చాలా మంది చాలా దారుణంగా నష్టపోయారు. భైరవకోన సినిమాకు అనిల్ సుంకర బ్యానర్ కూడా తోడయింది. అందువల్ల కచ్చితంగా తగ్గించి ఇవ్వడమో, డిస్ట్రిబ్యూషన్ కు ఇవ్వడమో ఇలాంటి వ్యవహారాలు వుండనే వున్నాయి.. పైగా ఏజెంట్ కోర్టు వ్యవహారాలు వున్నాయి. ఇవన్నీ కలిసి భైరవ కోన మీద బరువు పెంచుతున్నాయి.
సినిమా వర్క్ అయిపోయింది. ఆల్ మోస్ట్ కాపీ రెడీ అనే స్టేజ్ లో వుంది. ఈ తరహా జానర్ లకు ఆదరణ బాగుంటోంది. ఇన్ టైమ్ లో విడుదల చేసుకుంటే బాగానే వుంటుంది. కానీ ఫిబ్రవరి తరువాత కానీ భైరవ కోన సినిమాకు స్లాట్ కనిపించడం లేదు.