బాలీవుడ్ లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అందాన్ని మెరుగుపరుచుకునే క్రమంలో చాలామంది ఈ పని చేశారు. అయితే ఈ లిస్ట్ లో అనన్య పాండే పేరు పెద్దగా వినిపించలేదు. గతంలో ఒకట్రెండు సందర్భాల్లో ఆమె పేరు ప్రస్తావనకు వచ్చినా పెద్దగా ఎవ్వరూ దృష్టిపెట్టలేదు.
ఈసారి మాత్రం అనన్య పాండేపై ఫోకస్ గట్టిగా పడింది. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనికి కారణం, అనన్య పాండే పెట్టిన ఓ పాత ఫొటో.
జస్టిన్ బీబర్ ప్రదర్శనలో సెల్ఫీ దిగింది అనన్య. కొన్నేళ్ల కిందట అతడితోనే దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ రెండు ఫొటోల్లో ఆమె ముక్కులో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు కాస్త మొద్దుగా ఉన్న ముక్కు కాస్తా ఇప్పుడు కోటేరు లాంటి ముక్కుగా మారింది.
దీంతో అనన్య పాండే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని తన ముక్కును తీర్చిదిద్దించుకుందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమందయితే ఆమె నుదురు, బుగ్గల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఏ హీరోయిన్ కైనా బొత్తిగా ఇష్టంలేని టాపిక్ ఇది. ఇలాంటి చర్చకు తనకుతానుగా ఆజ్యం పోసింది అనన్య పాండే. గతంలో వాణీ కపూర్ అందాలపై ఇలాంటి ట్రోలింగ్ ఓ రేంజ్ లో నడిచింది. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో అనన్య పాండేపై ట్రోలింగ్ నడిచేలా ఉంది.