ఇంకెక్కడి మెగా పవర్

జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాకు యాభై కోట్ల రెమ్యూనిరేషన్, ఇంకా లాభాల్లో వాటాలు. కానీ ఏం లాభం? నిర్మాతలు, బయ్యర్లకు? రీ ఎంట్రీ తరువాత ఎంత సాధించినట్లు? విడుదలయిన రెండు…

జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాకు యాభై కోట్ల రెమ్యూనిరేషన్, ఇంకా లాభాల్లో వాటాలు. కానీ ఏం లాభం? నిర్మాతలు, బయ్యర్లకు? రీ ఎంట్రీ తరువాత ఎంత సాధించినట్లు? విడుదలయిన రెండు సినిమాలకు మంచి రేటింగ్ లే వచ్చాయి. మీడియా నుంచి గట్టి మద్దతునే లభించింది. కానీ కలెక్షన్లు అంతంత మాత్రం.

మన వాళ్లకు పరిచయం తక్కువైన హీరో. అసలు ఎవరో తెలియని హీరోయిన్, టెక్నీషియన్లు. అలాంటి కన్నడ డబ్బింగ్ సినిమా వచ్చి కేజీఎఫ్ 2 వచ్చి భీమ్లా నాయక్ టోటల్ కలెక్షన్లను తొలివారంలోనే అధిగమించేస్తోంది. 

నైజాంలో భీమ్లా టోటల్ రన్ 33 కోట్లకు పైగా అని చూపించారు. కానీ నిజానికి ఒక కొటి, కోటిన్నర తక్కువే అని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. ఈ వీకెండ్ కూడా కేజీఎఫ్ 2 గట్టిగా వుంటే నైజాంలో పుష్ప టోటల్ రన్ ను కూడా దాటేసే అవకాశం వుంది. 

కేజీఎఫ్ 2 అయిదు రోజులకే 30 కోట్లు వసూలు చేసింది నైజాంలో. విశాఖ ఏరియాకు భీమ్లా టోటల్ రన్ లో ఆరు నుంచి ఏడుకోట్ల మధ్యలో చేసింది. కేజీఎఫ్ 2 ఇప్పటికే ఆరు కోట్లకు చేరిపోయింది. అక్కడ పుష్ప సినిమా ఏడున్నర కోట్లు చేసింది. దాన్ని కూడా దాటేస్తుందని టాక్.

అలాగే ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు ఏరియాల్లో భీమ్లా, పుష్ప చేసిన ఫుల్ రన్ కలెక్షన్లు కూడా కేజీఎఫ్ 2 దాటేసేలా కనిపిస్తోంది. నిజానికి మెగా అనుకూల బాక్సాఫీసు లెక్కల నిపుణులు తమ చిత్తానికి అంకెల స్ప్రెడ్ చేసారు. డిస్ట్రిబ్యూటర్లు చెప్పే అంకెలు వేరు. వీళ్లు చెప్పే అంకెలు వేరు. ఇప్పుడు ఆ మెగా అంకెలు ఎక్కడ వీగి పోతాయో అని కేజీఎఫ్ 2 అంకెలు తగ్గించడం మొదలయిందని ఇన్ సైడ్ వర్గాల టాక్.

ఇన్నాళ్లూ మెగా హీరోలు అంటే రికార్డులు బద్దలు అవుతాయని, పుల్లింగ్ వుందని ఓ ప్రచారం. కానీ భీమ్లాకు మామూలు బజ్ రాలేదు. అయినా కలెక్షన్లు అంతే. భీమ్లాకు అదనపు రేట్లు లేవు. కేజీఎఫ్ 2 కూడా లేవు. ఇటీవల వచ్చిన మరో మెగా సినిమా గని అయితే బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాలు నమోదు చేసింది.