ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గమైన పిఠాపురానికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. రేపు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ పెంపు కార్యక్రమం జరుగుతుండగా పవన్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్లొనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా పిఠాపురం వెళ్తుడడంతో అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేశారు.
రేపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత జనసేన నేతలతో సమావేశం కానున్నారు. అలాగే 2 వ తేదిన కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్ని వారికి దిశానిర్ధేశం ఇవ్వనున్నారు. 3వ తేదిన ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ సహకారంతో గెలిచిన పవన్ కళ్యాణ్.. గెలిచిన తర్వాత ఆయన్ను దూరం పెట్టి పిఠాపురం బాధ్యతలను నాగబాబుకు అప్పచెప్పారు. ఇప్పటికే ఆయనకు ఎటువంటి అధికార హోదా లేకపోయిన నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. పిఠాపురంలో ఎలాంటి నిర్ణయాలైనా జనసేన ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌ను మాత్రమే అడిగి తీసుకోవాలని అధికారులకు నాగబాబు సూచించడం విశేషం.
రేపు పిఠాపురం వెళ్తున్న డిప్యూటీ సీఎం అధికారులకు ఎటువంటి సూచనలు ఇస్తారనే ఆసక్తి నెలకొంది. కాగా ఎన్నికల టైంలో పవన్ మాట్లాడుతూ నేను రాష్ట్రం మొత్తం బాధ్యతలు తీసుకుంటా పిఠాపురం బాధ్యత మొత్తం వర్మనే చూసుకుంటారు అని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ పర్యటనలో వర్మపై పవన్ స్పష్టత ఇస్తారా? లేదా? అనేది చూడాలి