కొట్టించుకోడానికి సిద్ధంగా లేనుః కేతిరెడ్డి

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటుగా స్పందించారు. తాడిప‌త్రిలో కేతిరెడ్డిని అడుగు పెట్ట‌నివ్వ‌న‌ని, ఒక‌వేళ వ‌స్తే పంచే ఊడ‌దీసి కొడ్తాన‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి హెచ్చ‌రించిన నేప‌థ్యంలో ఆయ‌న…

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటుగా స్పందించారు. తాడిప‌త్రిలో కేతిరెడ్డిని అడుగు పెట్ట‌నివ్వ‌న‌ని, ఒక‌వేళ వ‌స్తే పంచే ఊడ‌దీసి కొడ్తాన‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి హెచ్చ‌రించిన నేప‌థ్యంలో ఆయ‌న అక్క‌డ అడుగు పెట్ట‌డం గ‌మ‌నార్హం. బెయిల్ ష్యూరిటీలు ఇచ్చేందుకు తాడిప‌త్రి పోలీస్ స్టేష‌న్‌కు కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. బెయిల్ మంజూరై ఐదు రోజుల‌వుతున్నా ష్యూరిటీలు ఎందుకు తీసుకోలేద‌ని పోలీసుల‌ను కేతిరెడ్డి నిల‌దీశారు.

అనంత‌రం మీడియాతో పెద్దారెడ్డి మాట్లాడుతూ తాడిప‌త్రి అల్ల‌ర్ల కేసులో హైకోర్టు త‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ఇచ్చింద‌న్నారు. హైకోర్టు ఆదేశాల‌ను లెక్క చేయ‌కుండా, త‌న‌ను తాడిప‌త్రికి రాకుండా చేస్తున్నార‌న్నారు. ఎలాంటి ష్యూరిటీలు ఇవ్వ‌న‌ని, పోలీసులు ఏం చేస్తారో చేసుకోండ‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి చెప్ప‌డాన్ని ఆయ‌న గుర్తు చేశారు. పంచె ఊడ‌దీసి కొడ‌తాన‌న్నార‌న్నారు. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఆస్తుల్లోకి వెళుతుంటే ఏదైనా అనాల‌న్నారు.

87వేల ఓట్లు త‌న‌కు వేశార‌న్నారు. ఇంత మందిని పెట్టుకుని త‌న‌ను రానివ్వ‌న‌ని, జిల్లా బ‌హిష్క‌ర‌ణ చేస్తాన‌ని జేసీ అన‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జేసీ ఏమైనా ముఖ్య‌మంత్రా? క‌లెక్ట‌రా? పోలీస్ అధికారా? అని నిల‌దీశారు. ముందుగా అత‌ని అర్హ‌త ఏంటో జేసీ చెప్పాల‌న్నారు. వెహిక‌ల్స్‌కు సంబంధించి తాను ఫిర్యాదు చేయ‌గా పెట్టిన కేసు కాద‌న్నారు.

అంతు చూస్తాన‌ని జేసీ హెచ్చ‌రించార‌ని, తాము చూస్తూ ఊరుకోడానికి అమాయ‌కులం కాద‌న్నారు. మీ ఇంటి ద‌గ్గ‌ర వంట మ‌నుషుల‌మో, డ్రైవ‌ర్ల‌మో కాద‌ని జేసీని ఉద్దేశించి ఆయ‌న అన్నారు. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, మ‌రో 10 మందిపై ఆంక్ష‌లు ఉన్నా తాడిప‌త్రిలో విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నార‌న్నార‌ని ఆయ‌న అన్నారు. తాడిప‌త్రి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి జాగీరు కాద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

త‌న‌ను కొడ‌తాన‌న‌డంపై పెద్దారెడ్డి ఘాటుగా స్పందించారు. త‌న‌కు ఏ విధంగా కుటుంబ స‌భ్యుల‌న్నారో, జేసీకి కూడా అట్లే ఉన్నార‌న్నారు. కొడితే కొట్టించ‌డానికి తాను అమాయ‌కుడిని కాద‌న్నారు. త‌న అన్న‌ను చంపావ‌ని, తాను ఆ విధంగా బ‌లి కావ‌డానికి సిద్ధంగా లేన‌న్నారు.

తిరిగి అదే ప‌రిస్థితి తెచ్చుకోవ‌ద్ద‌ని జేసీకి పెద్దారెడ్డి హెచ్చ‌రిక చేశారు. రెచ్చ‌గొట్టొద్ద‌నే ఉద్దేశంతో స‌హ‌నం పాటిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. తన‌ను ఏమైనా చేస్తే, మూల్యం చెల్లించుకుంటావ‌ని హెచ్చ‌రించారు. త‌న‌ను ఏమైనా చేస్తే త‌న ఇద్ద‌రు కుమారులు, అలాగే అన్న కుమారులు ఉన్నార‌న్నారు. త‌న ఊపిరి ఉన్నంత వ‌ర‌కూ తాడిప‌త్రిలోనే వుంటాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

23 Replies to “కొట్టించుకోడానికి సిద్ధంగా లేనుః కేతిరెడ్డి”

  1. నువ్వు కొట్టించుకోడానికి “సిద్ధం” గా లేవు.. కరెక్టే..

    కానీ.. వాళ్ళు నిన్ను కుమ్మడానికి “సిద్ధం” గానే ఉన్నారు.. సో .. కొట్టించుకోడానికి “సిద్ధం” అయిపో..

      1. ఆ తిట్టేదేదో తెలుగు లో తిట్టుకోండి సర్.. మీ జగన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం రాతలు కామెడీ గా ఉన్నాయి..

          1. ఆ తిట్టేదేదో తెలుగు లో తిట్టుకోండి సర్.. మీ జగన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం రాతలు కామెడీ గా ఉన్నాయి..

          2. ఆ తిట్టేదేదో తెలుగు లో తిట్టుకోండి సర్.. మీ జగన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం రాతలు కామెడీ గా ఉన్నాయి.

      1. మీకు చదవడం కష్టం గా ఉంటె.. చదవొద్దండీ.. ఎందుకు అంతగా నాలిక కోసేసుకొంటున్నారు..

        నా కామెంట్స్ చదవకుండా బ్లాక్క్ చేసుకోండి.. సింపుల్ కదా..

        1. enni rojulu ade chesa leka pothe roju ni laga anniyiki comment chesukunta kurchuntara endi..niku lokesh roju 10/25Rs istunademo ley ..andukey egabadi rastunav.

          1. నా ఆస్తులు సంపాదన.. పుట్టుపూర్వోత్రాలు..కుటుంబ సంగతులు.. మీకెందుకండీ..

            మీరెవరు.. నేనెవరు..

            కామెంట్స్ లో రాసింది నచ్చితే లైక్ కొట్టుకొంది.. నచ్చకపోతే డిస్ లైక్ కొట్టుకొంది..

            నేను కామెంట్స్ రాస్తుంటే.. మీకు నష్టమేదో జరిగిపోతున్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నారు..

            మీ పార్టీ ఓడిపోయాక. ఇక చేసేదేమీ లేక ఏడవడం మొదలెట్టారా.. అంతే మీ గతి.. మీ బతుకు..

            నా కామెంట్స్ నచ్చకపోతే .. మీకు చదవడం కష్టం గా ఉంటె బ్లాక్క్ చేసుకోండి సర్..

            నా కామెంట్స్ నచ్చేవాళ్ళు చదువుకొంటారు.. నీ కోసం నా కామెంట్స్ రాయడం మానడం కుదరదు.. పీరియడ్..

      1. వాళ్లకి ఎంత ఉందొ నాకెందుకు.. వాళ్లకి ఉందొ లేదో మీకు బాగా తెలుసనుకుంటా..

  2. :red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

    1. ఒక వేళ ఇవ్వకపోతే మీరు చేసేవి ఒత్తి ఆరోపణలు అని తేలిపుతుంది

Comments are closed.