మహేష్ బాబు సినిమాపై మరో గాసిప్

మహేష్ బాబు సినిమాపై గాసిప్స్ కొత్తేం కాదు. ఓసారి సినిమా ఆగిపోయిందంటారు, మరోసారి సినిమాలో హీరోయిన్ మారిందంటారు. ఇంకోసారి సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందంటారు. ఇప్పుడు మరో గాసిప్ పుట్టుకొచ్చింది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఓ…

మహేష్ బాబు సినిమాపై గాసిప్స్ కొత్తేం కాదు. ఓసారి సినిమా ఆగిపోయిందంటారు, మరోసారి సినిమాలో హీరోయిన్ మారిందంటారు. ఇంకోసారి సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందంటారు. ఇప్పుడు మరో గాసిప్ పుట్టుకొచ్చింది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఓ కొత్త సినిమా రాబోతోంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ ను తీసుకున్నారట.

ఈమధ్య పాన్ ఇండియా అప్పీల్ కోసం బాలీవుడ్ నటీనటుల్ని తీసుకుంటున్నారు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల్లో ఈ పద్ధతి ఫాలో అయ్యారు. ఇందులో భాగంగా మహేష్ బాబు సినిమా కోసం అనీల్ కపూర్ ను తీసుకున్నారనేది ఆ పుకారు సారాంశం. అయితే దీన్ని 'సితార' జనాలు తిప్పికొట్టారు. అసలు అలాంటి ప్రతిపాదనే లేదని తేల్చిచెప్పారు.

మహేష్ మూవీకి సంబంధించి అనీల్ కపూర్ ప్రస్తావన రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు సర్కారువారి పాట సినిమాను ప్రకటించిన కొత్తలో అనీల్ కపూర్ పేరు తెరపైకొచ్చింది. ఈ సినిమాలో వైట్ కాలర్ క్రిమినల్ పాత్ర ఒకటి ఉంది. దాని కోసం అనీల్ కపూర్ ను తీసుకున్నారంటూ కథనాలు వచ్చాయి. కానీ తర్వాత రోజుల్లో అది పుకారు అని తేలింది. ఇప్పుడు మహేష్-త్రివిక్రమ్ సినిమాపై వస్తున్న వార్తలు కూడా పుకార్లు అని తేలాయి.

మహేష్-త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర ఒకటి ఉందనేది నిజం. ఆ పాత్ర కోసం పృధ్విరాజ్, ఫహాద్ ఫాజిల్ రేంజ్ నటుడి కోసం చూస్తోంది యూనిట్. అంతేతప్ప, అనీల్ కపూర్ లాంటి స్థాయి ఉన్న నటుడు ఆ పాత్రకు అక్కర్లేదనేది తాజా సమాచారం.