బాబుకూ రూ.15 వేలు.. ఆడుకుంటున్న నెటిజ‌న్లు!

టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కమైన త‌ల్లికి వంద‌నం ప్ర‌చారక‌ర్త నిమ్మ‌ల రామానాయుడు సోష‌ల్ మీడియాలో హీరో. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఒక ఇంటి వ‌ద్ద పిల్ల‌ల్ని చూసి రామానాయుడు ఉత్సాహంగా నీకు రూ.15 వేలు,…

టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కమైన త‌ల్లికి వంద‌నం ప్ర‌చారక‌ర్త నిమ్మ‌ల రామానాయుడు సోష‌ల్ మీడియాలో హీరో. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఒక ఇంటి వ‌ద్ద పిల్ల‌ల్ని చూసి రామానాయుడు ఉత్సాహంగా నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకూ రూ.15 వేలు అంటూ పెద్ద ఎత్తున ఊద‌ర‌గొట్టారు. ఇంట్లో ఎంత మంది పిల్ల‌లున్నా, ప్ర‌తి ఒక్క‌రికీ రూ.15 వేలు చొప్పున చ‌దువుకోడానికి అంద‌జేస్తామ‌ని చంద్ర‌బాబు మొద‌లుకుని రామానాయుడు వ‌ర‌కూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డానికి ఆర్థిక ఇబ్బందులంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప‌థ‌కాల‌కు కేటాయింపులు చూపాల్సి వ‌స్తుంద‌నే భ‌యంతో చివ‌రికి బ‌డ్జెట్‌ను కూడా ప్ర‌వేశ పెట్ట‌లేని వైనం. ఇవ‌న్నీ కాసేపు ప‌క్క‌న పెడ‌దాం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టారు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఏపీ ప్ర‌భుత్వానికి అప్పు ఇచ్చే బాధ్య‌త తీసుకుంటామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. చంద్ర‌బాబు త‌ల్లికి వంద‌నం కింద ఒక్కొక్క‌రికి రూ.15 వేలు ఇస్తామ‌ని హామీ ఇవ్వ‌డాన్ని దృష్టిలో పెట్టుకుని నెటిజ‌న్లు త‌మదైన సృజ‌నాత్మ‌కత‌కు ప‌దును పెట్టారు. ప్ర‌తి విద్యార్థికి చంద్ర‌బాబు రూ.15 వేలు ఇవ్వ‌డం సంగ‌తేమో గానీ, ఆయ‌న‌కు మాత్రం రూ.15 వేలు కోట్లు అప్పు ఇస్తామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారంటూ నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతూ, ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

పిల్ల‌లకు రూ.15 వేలు ఇస్తామ‌ని బాబు, రామానాయుడు చెబుతున్న‌ట్టుగా చిత్రాలు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ఇప్పుడు అద‌నంగా ఆ పిల్ల‌ల వ‌రుస‌లో బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రామానాయుడు కూడా చేర‌డం నెటిజ‌న్ల సృజ‌నాత్మ‌క‌త‌ను ప్ర‌తిబింబిస్తోంది. సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇలాంటివి పుట్టుకొస్తున్నాయ‌ని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

15 Replies to “బాబుకూ రూ.15 వేలు.. ఆడుకుంటున్న నెటిజ‌న్లు!”

  1. ఏడాదికి ఆరు పంటలు పండే కృష్ణ ఒండ్రు నేలలో నిర్మాణాలు చేపడితే ఆరు గాలం కష్టపడే నిజమైన రైతు ఉసురు పోసుకోవడమే.. చీటికీ మాటికీ పర్యావరణం అనుమతులు వుండాలనే కేంద్రానికి కనీస స్పృహ లోపించడం దురదృష్టకరం.

    1. ఏడాదికి ఆరు పంటలా..? అంటే రెండు నెలల్లో ఒక పంట. రెండు నెలల్లో చేతికి వచ్చే పంటేదో చెప్పండి ముందు. ఎన్.జి.టి… అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు తీసుకునే చంద్రబాబు అక్కడ రాజధాని ప్రకటించాడు. కాస్త తెలుసుకుని కామెంట్ చేయండి.

  2. Indexation removed on real-estate and this is going to impact Amaravathi real-estate heavily. Mark my words. Everyone who bought lands or houses after 2001 are going to pay 12.5% LTCG, get prepared. This is big blow which is not being highlighted by main stream media

  3. ఒక్కటి మాత్రం నిజం కేంద్ర బడ్జెట్ విషయంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేలు! అసలు బడ్జెట్ లో ఆంధ్రకు ఏమొచ్చింది ఎంతొచ్చింది అనే చర్చ జరిగేదే కాదు. చర్చ సంగతి పక్కన పెడితే అసలు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పేరే ఉండేది కాదు. ఈ కూటమి వచ్చాక మళ్లీ అవే చర్చలు..

  4. ఎహే … కేంద్రం తొ ఒప్పందాలు నెరవేర్చాలి.. ఒకటి లాండ్ టైటిలింగ్, రెండు విశాఖ స్టీల ప్రైవేటికరణం..ఖచ్చితంగా అమలు పరచాల్సిన ఒప్పందాలు.. లేకపోతె బాజపా తెదేపా కి సప్పోర్ట్ ఏమిటి..ఇవన్ని చేసాకనే బ్రమరావతి ఆశలు.. ఇక పోలవరం పోలేరమ్మ జాతరలా తరతరాలు కడుతునే ఉంటారు..

Comments are closed.