తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 20న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన కమ్మ కుల సమ్మేళనానికి హాజరై ప్రసంగించడం దారుణం. కుల సభలు ఆయా కులాల వారు నిర్వహించుకోవడం ఆనవాయితీ. అయితే, ఆధిపత్య కులాలు తమ సమాజంపై పట్టుని తెలియచెప్పడానికి, తమ ఖ్యాతిని బాహాటంగా ప్రచారం చేసుకోవడానికి నిర్వహించే సభలో ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి వంటి నాయకుడు హాజరవడం ఒక దుష్పరిణామం.
ఆయన రాజకీయ ప్రస్థానం ఆ కుల పెద్దల అండదండలతోనే మొదలైనప్పటికీ, తెలంగాణ లాంటి పోరాట భూమికి ముఖ్యమంత్రి గా ఉంటూ రాష్ట్ర “ఇజ్జత్” ను పణంగా పెట్టిన చర్యగా చెప్పవచ్చు. ప్రత్యేక తెలంగాణ నినాదం బలం గా నిల్చుని “ఆంధ్రోళ్ల” ఆధిపత్యం కారణంగా పోరాడిన రాష్ట్రంలోనే ఆ ఆధిపత్యానికి ప్రధాన కారణం అయిన కులానికి చెందిన సభకు హాజరుకావడం ఉద్యమంలో అసువులు బాసిన వారి త్యాగాన్ని అవమానించడమే.
కేసీఆర్ ని ఓడించి ప్రజా ప్రభుత్వం స్థాపించామనే కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను ఎలా సమర్థిస్తుంది? రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత అభీష్టంతో వెళ్ళారా లేక ఇది పార్టీ విధి విధానమా? జాతీయ పార్టీ వెన్నుదన్ను ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య కులవాదానికే మా ఓటు అని ప్రకటిస్తుందా? మరోవైపు రాహుల్ గాంధీ కుల గణన గురించి మాట్లాడటం, ప్రభుత్వ పదవుల్లో బీసీలకు తగు నిష్పత్తిలో ప్రాతినిధ్యం కల్పించాలనడం మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన ఊసే ఎత్తకపోవడం? రాహుల్ గాంధీ అంబానీ పెళ్లికి పిలిచినా వెళ్ళక నిరసించడం, అలాంటి డబ్బు ప్రదర్శనలో భాగమైన కుల సభకు రేవంత్ రెడ్డి హాజరై తన ఆమోదాన్ని తెలపడం వైరుధ్యంగా ఉంది.
ఇదే జూలై మాసంలో జరిగిన కారంచేడు నరమేధానికి నేటికి 39 ఏళ్లు. ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లో దళితులు రాజ్యాధికారానికి దూరంగానే ఉన్నారు. ఆ నరమేధాన్ని కావించిన అధిపత్య కుల సమ్మేళనానికి తెలంగాణ దళిత ఓటు బ్యాంకును గంపగుత్తగా సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హాజరవడంలో దాగి ఉన్న రాజకీయ అపహాస్య కేళి లౌకిక ఆలోచనాపరులను దహించివేస్తుంది.
డాక్టర్ జి. నవీన్
Email: [email protected]
రచయిత 20 ఏళ్లుగా సామాజిక, రాజకీయ విషయాల పై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తున్నారు
Whether TG or AP all reddies future is only with kootami and Janasena.
తూ..
మాల మహాసభలు , మాదిగ మహా సభలు , రెడ్డి సువార్త సభలు అని సంకరజాతి సభల జగన్ రెడ్డి కి అలవాటేగా మాలి ఈ వ్యాసం అప్పుడెందుకు రాయలేదు ?
orey nuvve pedda sankara jathi gadivi neekendukuraa jagan meeda edupu..
sankara jathi ante yenti…? ye kulalu sankara jathi ki chendhani kulalu, yendhuku…?
రచయిత 20 ఏళ్లుగా సామాజిక, రాజకీయ విషయాల పై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తున్నారు??? అచ్చు తప్పు ..
రచయిత 20 ఏళ్లుగా సామాజిక, రాజకీయ విషయాల పై విష వ్యాసాలు రాస్తున్నారు అని వుండాల్సింది 🙂
ఇది సహజమే GA . గ్రామాల్లో ఏ కుల కార్యక్రమము జరిగినా, ఏ కులపోడైనా ఆ గ్రామా సర్పంచ్ ని ఆహ్వానించటం సహజముగా జరిగేదే. ఇందులో లాజిక్ లు వెదక వద్దు.
First thing CBN is top most political leader in India same time jagan is India’s biggest financial political criminal .
కులాభిమానం కొంచెం ఎక్కువ ఉన్నా… పక్క కులాలని తొక్కి పైకి రావాలి అనే లక్ష్యం ఆ కులానికి లేదు కాబట్టి వెళ్ళటం లో తప్పులేదు. అందరిని కలుపుకు వెళ్ళటం ఒక సీఎం చేసేపని. అంతే కానీ మన చేతకాని ముండలాగా ముడుచుకు కూర్చుని నాకు వాళ్ళు అవసరం లేదు అంటే ఏమైద్దో 11రెడ్డిని అడిగి తెలుసుకోండి..
telangana reddlaku seema redla laaga pogaru undadu.
telangana vaallaki seema redla laga pogaru undadu.
telangana vaalaki seema redla laaga pogaru undadu.
ఒక్క మాటలో నిజంచెప్పాలంటే కమ్మవారికి కులకట్టు ఎక్కువ.వారి అభివ్ర్రధ్ధికి అదికూడ ఒకకారణం . కానీ రాష్ట్రానికిగాని దేశానికికాని వారివల్ల ఏనాడూ ద్రోహంజరగలేదు .వారినిగౌరవించటానికి ,వారిసభలకువెళ్ళటానికి ఈ ఒక్కటిచాలు .
Telengana vala dowrbagyam