స్టీల్ ప్లాంట్ కి విదిలింపులు కూడా లేవుగా?

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏమి చేయాలనుకుంటుందో కేంద్రం చెప్పదు, ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి పెద్దలు కూడా అడగడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. వధ్య శిల మీద విశాఖ ఉక్కు కర్మాగారం…

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏమి చేయాలనుకుంటుందో కేంద్రం చెప్పదు, ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి పెద్దలు కూడా అడగడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. వధ్య శిల మీద విశాఖ ఉక్కు కర్మాగారం పెట్టి కేంద్రం దూకుడు చేస్తూంటే అంతా చోద్యం చూస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కి తాజా బడ్జెట్ లో ఎలాంటి ఉపశమనం లేకుండా పోయింది. అంతే కాదు నిధులలో సైతం విదిలింపులు కూడా లేవు అని అంటున్నారు. సాక్ష్యాతు కేంద్ర ఉక్కు మంత్రి హెచ్ డి కుమారస్వామి విశాఖ వచ్చి ప్లాంట్ ని అంతా చూసి పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయబోమని కూడా స్పష్టత ఇచ్చారు.

అంతా మంచే జరుగుతుందని స్టీల్ ప్లాంట్ కార్మిక లోకం ఆనందించింది. అయితే కేంద్ర బడ్జెట్ లో మాత్రం ప్లాంట్ విషయంలో ఎలాంటి కీలక ప్రకటన లేదు. ప్రైవేట్ చేయమని విస్పష్టంగా చెప్పలేదు. స్టీల్ ప్లాంట్ కి కేవలం 620 కోట్లు ఇస్తున్నట్లుగా పేర్కొంది అది కూడా స్టీల్ ప్లాంట్ మొత్తమే అని అంటున్నారు.

ఈ నిధులను కేంద్రం ఇచ్చేది కాదని ప్రతీ ఏటా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రొజెక్షన్ కింద చూపించేదే అని అంటున్నారు. దాన్ని చూపించి వందల కోట్ల నిధులు ఇచ్చినట్లుగా కేంద్రం బడ్జెట్ లో పెట్టడం మీద కార్మికులు మండిపడుతున్నారు. ఈ బడ్జెట్ ని చూసిన వారు అంతా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే కట్టుబడి ఉందని అని గట్టిగానే నమ్ముతున్నారు.

కూటమి నేతలు కానీ ఉక్కు మంత్రి కానీ చెప్పిన మాటలు అన్నీ ఉత్త మాటలే అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూస్తే ఈ రోజుకు 17 వేల కోట్ల అప్పుల్లో ఉంది అని లెక్కలు చెబుతున్నాయి. అంతే కాదు పది వేల కోట్ల నష్టాలు ప్లాంట్ ని వెంటాడుతున్నాయి.

స్టీల్ ప్లాంట్ కి ఉన్న అప్పుకి నెలకు 160 కోట్ల రూపాయలను చెల్లిస్తోంది. అలాగే ప్రతీ మూడు నెలలకు అసలు కింద మరో 450 కోట్ల రూపాయలను చెల్లిస్తోంది అని గణాంకాలు చెబుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కి వచ్చే ఆదాయం అలా వడ్డీలకు చెల్లించడానికే పోతోందని అందువల్ల కనీసం మూడేళ్ల పాటు అయినా అసలు వడ్డీ చెల్లించకుండా మారిటోరియం విధించాలని డిమాండ్ కూడా వస్తోంది.

ఈ మూడేళ్ల కాలంలో ప్లాంట్ తనకు తానుగా నిలదొక్కుకుంటుందని కూడా అంటున్నారు. అయితే ఆ విషయంలో ఎవరు కేంద్రానికి చెబుతారు. ప్రైవేట్ కాకుండా ఎవరు ఆపుతారు అన్నదే పెద్ద సమస్యగా మారింది. కూటమి నేతలు అయితే బడ్జెట్ బాగుంది అని పొంగుతున్నారే కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోవడం లేదని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తారు అన్న సంగతి కూటమి పెద్దలకు కూడా తెలిసి ఇలా ప్రజలను మభ్యపెడుతున్నారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.

9 Replies to “స్టీల్ ప్లాంట్ కి విదిలింపులు కూడా లేవుగా?”

  1. ఈ గణాంకాలు జగన్ అడ్డదారిలో ఒక్క చాన్సు అని అడుక్కున్న అధికారం లో ఉన్నప్పుడు చెప్పి ఉంటె మెడలు వంచి అవసరమైతే విరిచి డ్రాకులా లాగ కేంద్రం ర!క్తం తాగేవాడు కదా

  2. అవును మరి అన్న టైం లో స్టీల్ ప్లాంట్ వైభోగం నా భూతో నా భవిష్యత్ కదా

  3. “విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూస్తే ఈ రోజుకు 17 వేల కోట్ల అప్పుల్లో ఉంది అని లెక్కలు చెబుతున్నాయి. అంతే కాదు పది వేల కోట్ల నష్టాలు ప్లాంట్ ని వెంటాడుతున్నాయి.” – నాకు అర్ధం కాలా

  4. Vizagites are the most selfless people in AP. They did so much tyagam for one capital that no words are there to praise them. Just imagine if Jaggu became CM. Those 15000 crores loan would have been allocated for Vizag development. But despite knowing all that they did sacrifice for the benefit of all AP. Kootami will definitely remember their sacrifice and will do good to them. But first the capital will be built and then we will definitely do good to Vizag. Just wait for 2-3 years.

  5. Vizagites are the most selfless people in AP. They did so much sacrifice for one capital that no words are there to praise them. Just imagine if Jaffa became CM again. Those 15000 crores loan would have been allocated for Vizag development. But despite knowing all that they did sacrifice for the benefit of all AP. Kootami will definitely remember their sacrifice and will do good to them. But first the capital will be built and then we will definitely do good to Vizag. Just wait for 2-3 years.

  6. కేవలం ప్రాజెక్ట్ కు సరిపడా భూములు ఇచ్చి అమ్మేయడమే బెటర్ మిగిలిన భూములు అభివృద్ధి చేసి అమ్మి వైజాగ్ లో పారిశ్రామిక అభివృద్ధికి మౌలిక సదుపాయాలకు కొత్త పరిశ్రమలకు కావలిసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు చేసి ఉపాధి పెంచాలి స్టీల్ ప్లాంట్ కి మాత్రం ఇనుప ఖనిజాన్ని కేటాయించి అమ్మాలి ప్రభుత్వం వ్యాపారం చేసి ఆ ఉద్యోగుల జవాబుదారీ తనం లేమి వల్ల నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన నష్టం ప్రజల కట్టిన పన్నులు నుంచి తీయాలండం తప్పు

Comments are closed.