ప్రస్తుతం పవన్ చేతిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలున్నాయి. ఇవన్నీ షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. కానీ చాన్నాళ్లుగా ఈ సినిమాలేవీ సెట్స్ పైకి రాలేదు.
రాజకీయాలతో పవన్ బిజీగా ఉండడంతో, ఇవన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. మరి ఇలాంటి టైమ్ లో అసలు సెట్స్ పైకి రాని పవన్ సినిమాల పరిస్థితేంటి? ఇది అలాంటి సినిమానే.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మూవీ ప్రకటన కూడా వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకు ఆ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు.
సినిమా ప్రకటించినప్పుడే మూవీ జానర్, బ్యాక్ డ్రాప్ అన్నీ బయటపెట్టారు. కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇదిగో సెట్స్ పైకి వెళ్లిపోతున్నాం అనేలా స్టేట్ మెంట్స్ ఇచ్చారు. కట్ చేస్తే, పవన్ ఇప్పటివరకు ఆ సినిమాకు కాల్షీట్లు ఇవ్వలేదు.
సురేందర్ రెడ్డి సినిమా కంటే లేటుగా ప్రారంభించిన ప్రాజెక్టుల్ని పవన్ చేశాడు కానీ, ఆ సినిమాను మాత్రం పట్టాలపైకి తీసుకురాలేదు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుపై స్పందించాడు నిర్మాత రామ్ తాళ్లూరి.
“మన చేతిలో ఏం లేదు. ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలిసిందే. నా సైడ్ వర్క్ అంతా అయిపోయింది. స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. పూజ కూడా అయిపోయింది. అన్నీ అయిపోయాయి. ఇక అంతా ఆయన (పవన్ కల్యాణ్) చేతిలో ఉంది.”
ఇలా పవన్ కల్యాణ్ తో చేయబోయే సినిమాపై చేతులెత్తేశాడు నిర్మాత. రీసెంట్ గా పవన్ కల్యాణ్ ను కలిశానని, తన సినిమా సంగతి పక్కనపెడితే, అసలు పవన్ సినిమాలు చేస్తారా చేయరా అనేది కూడా తను చెప్పలేనని అన్నాడు. ఆయన సినిమాలు చేస్తారనే తను అనుకుంటున్నానని అభిప్రాయపడ్డాడు.
జనసేన పార్టీ స్థాపించినప్పట్నుంచి పవన్ కు టెక్నికల్ గా, ఆర్థికంగా సహకారం అందిస్తూ వచ్చారు రామ్ తాళ్లూరి. ఆ అభిమానంతో రామ్ తో సినిమా చేసేందుకు పవన్ అంగీకరించారు. కానీ అదిప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
ఇప్పటికిప్పుడు ఆ సినిమా సెట్స్ పైకి వచ్చేది కూడా అనుమానమే. ఎందుకంటే, ముందుగా ఓజీ పూర్తవ్వాలి. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు పార్ట్-2 షూటింగ్స్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత మాత్రమే సురేందర్ రెడ్డికి ఛాన్స్. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా సెట్స్ చేస్తే అంతే సంగతులు.
whats the use of commenting here ? alll comments were removed by Moderator
whats the use of commenting here
జనం పట్టించుకోరు
site bandh chesukone poraa babu …