ఆకాశంలో ఆ తార ఎవరు?

కథ కొత్తగా ఉంటేనే దుల్కర్ సినిమా చేస్తాడనే సంగతి తెలిసిందే. సీతారామం, మహానటి సినిమాలు ఈ విషయాన్ని రుజువుచేయగా.. త్వరలోనే లక్కీ భాస్కర్ కూడా ఇదే కోవలో రాబోతోంది. ఇప్పుడీ విలక్షణ నటుడి నుంచి…

కథ కొత్తగా ఉంటేనే దుల్కర్ సినిమా చేస్తాడనే సంగతి తెలిసిందే. సీతారామం, మహానటి సినిమాలు ఈ విషయాన్ని రుజువుచేయగా.. త్వరలోనే లక్కీ భాస్కర్ కూడా ఇదే కోవలో రాబోతోంది. ఇప్పుడీ విలక్షణ నటుడి నుంచి మరో సినిమా వస్తోంది.

ఈ సినిమా పేరు ‘ఆకాశంలో ఒక తార’. ఫస్ట్ లుక్ నుంచే ఇదొక డిఫరెంట్ మూవీ అనే ఫీలింగ్ తెచ్చింది. పోస్టర్ లో దుల్కర్ సల్మాన్ చాలా సింపుల్ గా కనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఓ రైతులా ఉన్నాడు. దీనికితోడు ఓ చిన్న పాప బ్యాగ్ వేసుకొని స్కూల్ కు వెళ్తున్నట్టు చూపించారు. ఈ రెండు ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పొచ్చు..

ఇవి మాత్రమే కాదు, ఈ సినిమాలో మరో ప్రత్యేకత కూడా ఉంది. గీతాఆర్ట్స్, స్వప్న సినిమా బ్యానర్లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 2 సక్సెస్ ఫుల్ బ్యానర్లు కలవడం ప్రత్యేకత సంతరించుకుంది. వీళ్లకు లైట్ బాక్స్ మీడియా తోడైంది. త్వరలోనే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు.

పవన్ సాధినేని ఈ సినిమాకు దర్శకుడు. ఇంతకుముందు ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి లాంటి సినిమాలు.. 3-4 వెబ్ సిరీస్ లు తీశాడీ దర్శకుడు.

2 Replies to “ఆకాశంలో ఆ తార ఎవరు?”

Comments are closed.