భూ కబ్జాల మీద విచారణ జరగాల్సిందే!

భూ కబ్జాలు అంటూ ఊరకే ప్రకటనలు కాదు దాని మీద లోతు అయిన విచారణ జరగాల్సిందే. అది కూడా రాజకీయాలకు అతీతంగా అని అంటున్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కీలక నేతలు ఇటీవల…

భూ కబ్జాలు అంటూ ఊరకే ప్రకటనలు కాదు దాని మీద లోతు అయిన విచారణ జరగాల్సిందే. అది కూడా రాజకీయాలకు అతీతంగా అని అంటున్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కీలక నేతలు ఇటీవల మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాల మీద విచారణ చేపడతామని ప్రకటించారు.

అయితే దానికి సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇస్తూ భూ కబ్జాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందే అన్నారు. అది కూడా 2014 నుంచి విచారణ చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ఆ టైంలో టీడీపీ అధికారంలో ఉంది.

టీడీపీ హయాంలో విశాఖలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో కీలక నేతలు అంతా కూడా ఇందులో ఉన్నారని కూడా వైసీపీ సహా విపక్షాలు విమర్శలు చేస్తేనే చంద్రబాబు ప్రభుత్వం సిట్ ని నియమించి దర్యాప్తు చేయించింది. అయితే దాని నివేదిక మాత్రం బయటపెట్టలేదు.

ఇపుడు టీడీపీ వైసీపీ ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకోవడమే కాదు డిమాండ్ కూడా చేస్తున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వం విశాఖలో గత పదేళ్ళుగా యధేచ్చగా సాగిన భూ కబ్జాల మీద సమగ్రమైన విచారణ జరిపించాలని అంతా కోరుతున్నారు.

ఈ విచారణలో ఎవరు దోషులు అని తేలినా పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటేనే విచారణకు ఫలితం దక్కుతుదని అంటున్నారు. కేవలం వైసీపీ హయాంలో భూకబ్జాలు అంటూ పోతే మాత్రం అది పాక్షీంగానే విచారణ జరిగినట్లుగా భావించాల్సి ఉంటుందని మేధావులు అంటున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరుతున్నారు.

7 Replies to “భూ కబ్జాల మీద విచారణ జరగాల్సిందే!”

    1. 2004 నుంచి చేస్తే ఇంకా బాగుంటుంది, అది కూడా ఉమ్మడి ఆంధ్ర మొత్తం. అధికారం అడ్డం పెట్టుకొని ఎన్ని వేల ఎకరాలు బినామీల పేరున మన జలగ దోచుకొన్నాడో తెలుస్తుంది

  1. 2019 నుండి 2024 వరకూ మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? కబ్జా చేసిన వారిని ఎందుకు శిక్షించలేదు?

  2. Jeggul అనే గా0డు గాడి గంజాయి బానిసల పనే ఇది.. Bangalore పారిపోయిన వాణ్ణి denకొచ్చి vongobetti వాయి0చాలి

Comments are closed.