మొన్నటికిమొన్న విశాల్ ను టార్గెట్ చేసింది నిర్మాతల మండలి. తాజాగా ధనుష్ పై కూడా కొన్ని ఆరోపణలు చేసింది. ఇకపై ధనుష్ తో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు ముందుగా మండలిని సంప్రదించాలని కూడా సూచించింది. దీంతో నడిగర్ సంఘం, నిర్మాతల మండలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎప్పుడైతే తమిళ సినీ నిర్మాతల మండలి నుంచి ప్రెస్ నోట్ విడుదలైందో, ఆ వెంటనే అత్యవసరంగా సమావేశమైంది నడిగర్ సంఘం. ఈ మీటింగ్ లో ట్రెజరర్ కార్తి, వైస్-ప్రెసిడెంట్ పూచి మురుగన్ ప్రత్యక్షంగా పాల్గొనగా.. అధ్యక్షుడు నాజర్, జనరల్ సెక్రటరీ విశాల్ వీడియో కాల్ ద్వారా పాల్గొన్నారు.
తమిళ సినీ నిర్మాతల మండలి చేసిన వ్యాఖ్యల్ని నడిగర సంఘం పూర్తిగా తప్పుబట్టింది. నటీనటులకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలున్నా నడిగర్ సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, కానీ అలాంటి ఫిర్యాదు ఏదీ లేకుండా నేరుగా విశాల్, ధనుష్ పై చర్యలకు నిర్మాతల మండలి సిద్ధమైందని, దీన్ని తాము ఖండిస్తున్నామని తెలిపాడు కార్తి.
ఇన్నాళ్లూ నిర్మాతల మండలి, నటీనటుల మండలి సమన్వయంతో పనిచేశాయని, కానీ ప్రస్తుత నిర్మాతల మండలి మాత్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని కార్తి ఆరోపించారు. ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు నిలిపివేస్తున్నట్టు.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల్ని అక్టోబర్ 30లోగా పూర్తిచేయాలనే తీర్మానాలు కూడా తమకు తెలియవని నడిగర్ సంఘం తరపున కార్తి వెల్లడించాడు.
ధనుష్ పై తమకు లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేసిన నడిగర్ సంఘం.. వేలాది మంది కార్మికుల జీవితాలతో ముడిపడిన సినీ పరిశ్రమలో సమ్మె చేయబోతున్నామనే నిర్ణయాన్ని ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. పైగా ఫిలిం ఫెడరేషన్ కు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడం సబబుకాదన్నారు.
త్వరలోనే పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమౌతుందని.. అప్పుడు నడిగర్ సంఘం తరఫున నిర్ణయాల్ని లిఖిత పూర్వకంగా వెల్లడిస్తామని కార్తి తెలిపాడు. చూస్తుంటే.. ధనుష్ అంశం, నడిగర్ సంఘం, నిర్మాతల సంఘం మధ్య చిచ్చుపెట్టేలా ఉంది.
డబ్బు పెట్టె నిర్మాత కు తెలుసు నొప్పి ఏంటో. మూసుకుని act చేసి పని చేసుకోండి.
జనం పట్టించుకోరు