కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఈ నెల మొదటి వారంలో కాంగ్రెస్ కండువాను గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో ఏమైందో తెలియదు కానీ, ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అసెంబ్లీ ఎల్‌వోపీలో కృష్ణమోహన్‌రెడ్డి కలుసుకున్నారు.
బీఆర్ఎస్లో కొనసాగాలనే తన మనసులో మాటను కేటీఆర్‌తో ఆయన పంచుకున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంటానని మీడియాకు ఆయన చెప్పడం విశేషం. సాయంత్రం బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకోనున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దేబ్బే.
బీఆర్ఎస్ను ఖాళీ చేయాలనే ఆలోచనతో సీఎం రేవంత్‌రెడ్డి ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే పది మంది వరకూ కాంగ్రెస్‌లో చేరారు. కృష్ణమోహన్‌రెడ్డి లాగా ఎవరైనా తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చే ఆలోచన వుందా? అనే చర్చకు తెరలేచింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వుందనే మాటే తప్ప, ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఏమీ లేదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తానిచ్చిన హామీల్ని నెరవేర్చడానికి రాష్ట్ర ఖజానా సరిపోవడం లేదు. ఇక బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వారికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారనే మాట వినిపిస్తోంది.
ఇక్కడ ఎప్పుడో పాతిక కోట్లని చెప్పారు.అక్కడ ఇచ్చే అయిదారు కోట్లు ఏ మూలకు?
రేట్ kudaranappudu వెనక్కి vacheyadamlo తప్పు లేదు, ఎలాగూ రాజకీయాలు అలాగే తయారయ్యాయి కదా!
మొన్నటి బడ్జెట్లో ‘రైతు బంధు’ లాగా ‘ఆయారాం-గయారాం బంధు’ ప్రకటించలేదని నొచ్చుకున్నట్టున్నారు పాపం.
అందుకే బడ్జెట్ వరకు ఎదురు చూసి ఇప్పుడు బయటకు వస్తున్నారు
ఆదాయం లేదు…
పథకాలు ఇచ్చే దమ్ము లేదు…
వాడిని వీడిని లాగేసుకొని టైం పాస్ చేస్తున్నాడు…
6 నెల్లకే సగం ఎంపీలు బీజేపీ కి ఇచ్చేసాడు…
ఇంకో 2 ఏళ్ళు పోతే జవసత్వాలు నాకిపోతాయి…
తెలుగు ప్రజలు రె0డు రాష్ట్రాల్లో నె!త్తి నో!రు బాదుకుంటున్నారు.
ఆదాయం లేదు…
పథకాలు ఇచ్చే ద!మ్ము లేదు…
వాడిని వీడిని లాగేసుకొని టైం పాస్ చేస్తున్నాడు…
6 నెల్లకే సగం ఎంపీలు బీజేపీ కి ఇచ్చేసాడు…
ఇంకో 2 ఏళ్ళు పోతే జవసత్వాలు నాకిపోతాయి…
తెలుగు ప్రజలు రె0డు రాష్ట్రాల్లో నె!త్తి నో!రు బాదుకుంటున్నారు.