బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ ఎవరి దగ్గరైనా తాను నాలుగు రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతా అన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే ఆరోపించే వాళ్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది.
తనపై నిరాధార ఆరోపణలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే, కాంగ్రెస్ కళ్లలో నిప్పులు పోసుకుంటోందని ధ్వజమెత్తారు. ఎందుకంత ఓర్వలేనితనం అని ఆయన ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ శాడిజనానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు ఇచ్చిన సీట్లతో కేంద్రంలో పదేళ్ల పాటు అధికారాన్ని చెలాయించారని ఆయన గుర్తు చేశారు. ఏపీ గొంతు నులిపారని ఆయన ఆగ్రహించారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభపరిణామమని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ నష్టపోవడానికి ప్రధాన కారణం రాజధాని లేకపోవడమే అని ఆయన అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన చురకలు అంటించారు. ప్రతిపక్ష హోదా అనేది డిమాండ్ చేస్తే వచ్చేది కాదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లలో పదిశాతం సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా దక్కదన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని జీవీఎల్ హితవు చెప్పారు.
ఆ నాలుగు రూపాయలు వాడేసి ఒక్క క్షమాపణ తో సరిపోతుందా? భలే ఉన్నారు.
జీవి గారు లైట్ తీస్కోండి..అంతటి పీవీ కే తప్పలేదు.
బాబయ్యా నాలుగు కోట్లు ఇప్పించండి.. కావాలంటే క్షమాపణ చెపుదాం
1) ఈఏడాది అమ్మఒడి ఇవ్వలేము : లోకేష్
2) ఖజానాలో డబ్బు లేదు అమరావతి కట్టలేం: నారాయణ
3) ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు : నాదెండ్ల మనోహర్
4) ఆరోగ్యశ్రీ ఇవ్వలేం ఆయష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి: పెమ్మసాని
5) ఫ్రీ ఇసుక ఇవ్వలేము టన్నుకు 1200 కట్టాల్సిందే : చంద్రబాబు
6) మా సూపర్ సిక్స్ హామీలు చూస్తేనే నాకు భయమేస్తుంది, హామీలు అమలు చేయలేను : చంద్రబాబు
7) ప్రతి మహిళకు నెలకు 1500 ఊసే లేదు
8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు
9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు మొదలయిన 4 పోర్టులు,17 మెడికల్ కాలేజీల పనులు ఆగిపోయాయి
10) ఒక్క పథకం ఇవ్వలేదు కానీ .. 32 వేల కోట్లు అప్పులు మాత్రం చేశారు.
11) నాడు నేడు ఆగిపోయింది,ఐబీ సిలబస్ రద్దు ట్యాబ్ లు ఇస్తే విద్యార్థులు చెడిపోతారని పచ్చ మీడియాలో వక్ర కథనాలు
ఐపాయ.. 50 రోజుల్లోనే చేతులెత్తేశారు