ఆరోగ్యశ్రీపై ష‌ర్మిల‌కు అనుమానం!

ఆరోగ్య శ్రీపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో తీవ్ర దుమారం రేగ‌డంతో ఆరోగ్య శ్రీ అమ‌లుపై అనుమానాలు వ్య‌క్తం చేశారు ఏపీసీసీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌. పెమ్మ‌సాని…

ఆరోగ్య శ్రీపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో తీవ్ర దుమారం రేగ‌డంతో ఆరోగ్య శ్రీ అమ‌లుపై అనుమానాలు వ్య‌క్తం చేశారు ఏపీసీసీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌. పెమ్మ‌సాని వ్యాఖ్య‌ల‌పై సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు స‌మాధానం చెప్పాల‌ని ట్వీట్ట‌ర్ వేదిక‌గా డిమాండ్ చేశారు.

ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా? ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా? ఆరోగ్యశ్రీ ని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా? అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా? పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం?

ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా? ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా? గత వైసీపీ ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెడింగ్ లో పెడితే.. ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయి. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయి. దీనికి చంద్ర‌బాబు, ప‌వన్ క‌ల్యాణ్ వెంటనే స‌మాధానం చెప్పాలి.

ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన అద్భుత పథకం.పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకం. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకం. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించం. ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి సర్కార్ క్లారిటీ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 16 వందల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అంటూ ట్వీట్ చేశారు.

కాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే ఆయుష్మాన్ భారత్‌ను వినియోగించుకోవచ్చని, ఈ కార్డుల ద్వారా అయిదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సౌకర్యాన్ని పొందవచ్చని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైనన్ని డబ్బులు లేవని బిల్లులు క‌ట్ట‌క‌ రోగులకు ట్రీట్‌మెంట్ కూడా జరగట్లేదన్నారు. పెమ్మ‌సాని వ్యాఖ్య‌ల‌పై వైసీపీ మండిప‌డుతూ నిధులు లేవనే కారణంతో 25 లక్షల రూపాయల వరకు హెల్త్ కవరేజీని అందించే ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్ మంగళం పాడినట్టేనంటూ ఆరోపిస్తున్నారు. పెమ్మ‌సాని వ్యాఖ్య‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం క్లారిటీ ఇస్తే ఆరోగ్య‌శ్రీ అమ‌లుపై ఇత‌ర పార్టీల్లో ఉండే అనుమానాలు తొల‌గిపోతాయి.

9 Replies to “ఆరోగ్యశ్రీపై ష‌ర్మిల‌కు అనుమానం!”

  1. ఏంటి 25 లక్షల రూపాయలా బొక్క మీ ఎదవ ఉన్నప్పుడు కనీసం రోగులను జాయిన్ చేసుకోవడానికి కూడా హాస్పిటల్స్ వెనకాడాయి ఇస్తే కదా 25 అయినా 35 అయినా దాని వల్ల ఉపయోగం

    1. రే B0 గ @M … మీ అమ్మగారు.. మా అందరితో పడుకుని నిన్ను పుట్టించింది కాబట్టి.. ఆ B0 గ @M పువ్వుకు పుట్టిన నువ్వు ఇలా అబద్ధాలు చెప్పుకు బతుకుతున్నావ్ ర … నిజంగా ఒక్కే అయ్యకు పుట్టిన వాడివాతే.. ఇలా నిసిగ్గుగా అబద్దాలు చెప్పావు ర.. ల 0 జ K0 D @K@

  2. పిచ్చి GA….పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, మన అన్నయ్య ఎప్పటి నుంచో ఆ ఆయుష్ మాన్ భారత్ డబ్బుతోనే ఆరోగ్య శ్రీ బండి నడిపిస్తున్నాడు….తొందరపడి ట్రాప్ లో పడకు..😂😂

  3. 1) ఈఏడాది అమ్మఒడి ఇవ్వలేము : లోకేష్

    2) ఖజానాలో డబ్బు లేదు అమరావతి కట్టలేం: నారాయణ

    3) ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు : నాదెండ్ల మనోహర్

    4) ఆరోగ్యశ్రీ ఇవ్వలేం ఆయష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి: పెమ్మసాని

    5) ఫ్రీ ఇసుక ఇవ్వలేము టన్నుకు 1200 కట్టాల్సిందే : చంద్రబాబు

    6) మా సూపర్ సిక్స్ హామీలు చూస్తేనే నాకు భయమేస్తుంది, హామీలు అమలు చేయలేను : చంద్రబాబు

    7) ప్రతి మహిళకు నెలకు 1500 ఊసే లేదు

    8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు

    9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు మొదలయిన 4 పోర్టులు,17 మెడికల్ కాలేజీల పనులు ఆగిపోయాయి

    10) ఒక్క పథకం ఇవ్వలేదు కానీ .. 32 వేల కోట్లు అప్పులు మాత్రం చేశారు.

    11) నాడు నేడు ఆగిపోయింది,ఐబీ సిలబస్ రద్దు ట్యాబ్ లు ఇస్తే విద్యార్థులు చెడిపోతారని పచ్చ మీడియాలో వక్ర కథనాలు

    ఐపాయ.. 50 రోజుల్లోనే చేతులెత్తేశారు

Comments are closed.