విశాఖలో వైసీపీ ఇక అంతేనా?

వైసీపీ మరోసారి గెలిస్తే విశాఖలో ఎక్కడ చూసినా ఆ పార్టీ వైభవం కనిపించేదని అనుకోవాలి. రుషికొండ మీద సీఎం క్యాంప్ ఆఫీసు అని ప్రచారం సాగింది. అలాగే ఎండాడ వద్ద వైసీపీ ఆఫీసుని రెండున్నర…

వైసీపీ మరోసారి గెలిస్తే విశాఖలో ఎక్కడ చూసినా ఆ పార్టీ వైభవం కనిపించేదని అనుకోవాలి. రుషికొండ మీద సీఎం క్యాంప్ ఆఫీసు అని ప్రచారం సాగింది. అలాగే ఎండాడ వద్ద వైసీపీ ఆఫీసుని రెండున్నర ఎకరాలలో నిర్మించారు. అక్కడే వైసీపీ ప్రధాన కార్యాలయం కూడా తరలి వస్తుందని చెప్పుకున్నారు.

విశాఖలోనే జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు అని కూడా ఊదరగొట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చి మొత్తం సీన్ రివర్స్ అయింది. విశాఖలో వైసీపీ ఆనవాళ్ళు లేకుండా రిజల్ట్స్ షాక్ ఇచ్చేశాయి. వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీ నేతలు చెట్టుకొకరు పుట్టకొకరుగా అన్నట్లు అయ్యారు. చాలా మంది సైలెంట్ అయిపోయారు. వైసీపీకి చెందిన నాయకులు కొంతమంది మీడియా సమావేశాలు పెట్టాలనుకున్నా వైసీపీకి ఉన్న ఎండాడ ఆఫీసు దాకా వెళ్ళడం లేదు.

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తన ఆఫీసులో మీటింగ్స్ పెడుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ప్రెస్ క్లబ్ లలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. బొత్స సత్యనారాయణ లాంటి వారు విశాఖకు వస్తే ఆయన సతీమణి ఎంపీగా పోటీ చేసినపుడు తీసుకున్న ఆఫీసునే వాడుకుంటున్నారు.

ఆఖరుకి వైసీపీకి విశాఖ ప్రెసిడెంట్ గా ఉన్న కోలా గురువులు సైతం పాత ఆఫీసులోనే మీడియాతో మాట్లాడుతున్నారు. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ వస్తేనే ఎండాడ ఆఫీసుకు వెళ్లే పరిస్థితి ఉంది. ఆయన కూడా రాకపోకలు తగ్గించేశారు.

ఇవన్నీ చూస్తూంటే వైసీపీ చిరునామా ఏమైంది అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అయిదేళ్లకు ముందు విపక్షంలో ఉన్నా వైసీపీ ఢీ అంటే ఢీ అన్నట్లుగా అధికార పార్టీతో తలపడేది. ఆనాడు వైసీపీ లీడర్లు అంతా ఉత్సాహం మీద ఉండేవారు. అలాంటిది ఒక్కసారి అధికారం దక్కి ఆ వెంటనే జారిపోతే దానితో పాటుగా వైసీపీ ఆశలు కూడా జారిపోయాయా అన్న చర్చకు తెర లేస్తోంది.

20 Replies to “విశాఖలో వైసీపీ ఇక అంతేనా?”

  1. ఆనాడు వైసీపీ లీడర్లు అంతా ఉత్సాహం మీద ఉండేవారు. అలాంటిది ఒక్కసారి అధికారం దక్కి ఆ వెంటనే జారిపోతే దానితో పాటుగా వైసీపీ ఆశలు కూడా జారిపోయాయా అన్న చర్చకు తెర లేస్తోంది. ////

    అధికారం వొచ్చేవరకు అన్నగారి గొప్పతనము నాయకులకి ప్రజలకు తెలీదు కదా ..అందుకే ఉత్సహం .. ఇప్పుడు అంత బట్ట బయలు అయిన తరువాత మళ్ళి జనల నమ్మకం ఎలా పొందాలో తెలియక నిస్తేజం .

    1. చెప్పవులే సోది…ముందు నీ చంద్రబాబు గాడు సంపద సృష్టిచమను..అప్పులు కాదు….

      1. మనం చేసిన పెంట క్లీన్ చేయాలికదా .. టైం పడుతుందిలే అన్న .. నువ్వు అప్పటివరకు ఇలా ఏడుస్తూ ఉండు ..

          1. అవును కరెక్ట్ .. అందుకే తెలంగాణ వాళ్ళతో విభజన సమస్యలు గురించి మీటింగ్ పెట్టింది.. మధ్యలో.ఫైవ్ ఇయర్స్ మనం ప్యాలెస్ లో pubg ఆడుతూ కూర్చున్నాము కదా ..

    2. జయము జయము చద్రన్న.. నీలాంటి వెన్నుపోటు లేడు రా,, శకుని తాత నీలాంటి నీచుడే లెడురా. జీవితమంత మోసాలు నీ జీవితమంతా.. ఎర్రిపూ** బొల్లన.

      1. మా అన్న ఐదేళ్ల పాలన లో నరకము అనుభవించి నువ్వే మేలు అని ఓటేశారు చంద్రన్న .. జయము జయము చంద్రన్న..

        1. Hey.. Ila ooru peru lenollanto matladdoddu.. Vaala parents pettina peru kooda cheppukoledu.. Anta Piriki vedavalato anavasaram.. Kukkalu morugutu untai.. Lite teesko Brother.. DOnt waste your energy.. Veelaki anta sthayi ledu

  2. జగన్ మీద షర్మిల విమర్శలు ఆపనంత వరకు… వై సీ పీ ది డౌన్ ఫాలే

  3. ఇవన్నీ చూస్తూంటే వైసీపీ చిరునామా ఏమైంది అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. Yenti Nijame ? LOL

Comments are closed.