మళ్లీ తెరపైకి వరగల్ శ్రీను

వరంగల్ శ్రీను. ఈ పేరు నైజాం డిస్ట్రిబ్యూటర్ సర్కిళ్లలో వినిపించి చాలా కాలం అయింది. లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో నష్టాలు మూటకట్టుకున్నాడు వరంగల్ శ్రీను. అయితే ఈ నష్టాల్లో నైజాంలోని ఎగ్జిబిటర్ల డబ్బులు…

వరంగల్ శ్రీను. ఈ పేరు నైజాం డిస్ట్రిబ్యూటర్ సర్కిళ్లలో వినిపించి చాలా కాలం అయింది. లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో నష్టాలు మూటకట్టుకున్నాడు వరంగల్ శ్రీను. అయితే ఈ నష్టాల్లో నైజాంలోని ఎగ్జిబిటర్ల డబ్బులు కూడా వున్నాయి. లైగర్ నష్టాలను భర్తీ చేయాలి అనుకుంటే డబ్బులు వరంగల్ శ్రీనుకు ఇవ్వాలా? ఎగ్జిబిటర్లకు ఇవ్వాలా? అనే పాయింట్ ను బయటకు తీసారు. చార్మి- పూరి ఈ పరిస్థితిలో అలా వుండిపోయారు. తరువాత అసలు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ పద్దతిలో సినిమా ఇచ్చినందున లీగల్ గా ఎవరికీ ఏమీ ఇవ్వక్కరలేదని డిసైడ్ అయ్యారు.

కొందరు ఎగ్జిబిటర్లు ఛాంబర్ ను అప్రోచ్ అయినా లీగల్ గా రైట్ లేనందున ఏమీ జ‌రగలేదు. వరంగల్ శ్రీను లైగర్ విడుదల టైమ్ లో నాలుగు కోట్లు తక్కువ కట్టారనే వాదన కూడా వుంది. మొత్తం మీద ఇలా కాలం గడిచిపోతూ వస్తోంది. ఇప్పుడు టైమ్ వచ్చింది.

డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలకు వస్తోంది. నైజాంలో థియేటర్ యజ‌మానులు తమ డబ్బులు వెనక్కు వస్తాయేమో అని చూస్తున్నారు. ఈరోజు చాలా మంది ఎగ్జిబిటర్లు కలిసి ఏం చేయాలి అన్న దాని మీద డిస్కషన్లు సాగించారు. తమ సమస్య సెటిల్ అయ్యే వరకు డబుల్ ఇస్మార్ట్ కు థియేటర్లు ఇవ్వకూడదని పట్టుదలగా వున్నారు.

ఇలాంటి నేపథ్యంలో వరంగల్ శ్రీను మళ్లీ బయటకు వచ్చారు. లైగర్ ఎగ్జిబిటర్లను కలిసారు. అందరూ కలిసి వస్తే తను కూడా ఇబ్బందుల నుంచి బయటకు వస్తా అన్నారు. వరంగల్ శ్రీను కనుక ముందు వుండి పోరాడితే తాము వెనుక వుండి కచ్చితంగా మద్దతు ఇస్తామని ఎగ్జిబిటర్లు చెప్పారు.

ఇకపై ఈ కార్యాచరణ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.

4 Replies to “మళ్లీ తెరపైకి వరగల్ శ్రీను”

Comments are closed.