ఆలోచన మంచిదే గానీ.. అసంపూర్ణం, అపరిపక్వం!

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీర్ఘ రోగులు కోసం ఒక మంచి ఆలోచన చేసింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ కారణం మీద పింఛను అందుకుంటున్న వారి కోసం ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ…

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీర్ఘ రోగులు కోసం ఒక మంచి ఆలోచన చేసింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ కారణం మీద పింఛను అందుకుంటున్న వారి కోసం ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది.

నిజంగా ఇది మంచి ఆలోచన. అనారోగ్యంతో బాధపడుతూ అక్కడికే సగం కుంగిపోయి ఇబ్బంది పడే వారికి, ప్రభుత్వం నుంచి అందే పెన్షన్ జీవనాధారం అయిన వారికి ప్రయాణ ఖర్చుల భారం లేకుండా చేయడం మంచిదే! కానీ ప్రభుత్వం ఆలోచనను కార్యరూపంలో పెట్టే ముందు మరింత కసరత్తు జరగాల్సిన అవసరం ఉంది.

ఆర్టీసీ బస్సులలో ఉచితంగా వెళ్ళవచ్చు అని ఏకవాక్య జీవో తెచ్చినట్లుగా కాకుండా ఈ ఆలోచన అసంపూర్ణంగా అపరిపక్వంగా ఉన్నదని గుర్తించి సరిచేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది.

గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, తలసేమియా, పక్షవాతం, లెప్రసీ, లివర్ సమస్యలు హిమోఫిలియా వంటి సీరియస్ ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా పింఛను ఇస్తోంది. ఇలాంటివారు రాష్ట్రవ్యాప్తంగా 51 వేలమంది ఉన్నారు. పెన్షన్ వచ్చినప్పటికీ నెలవారీగా ఆసుపత్రులకు వెళ్లి రావడానికి వీరికి అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతూ ఉంటుంది. అందువల్ల వారికి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ వసతి కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

అయితే కేవలం బస్సులలో ఉచితంగా వెళ్ళమన్నంత మాత్రాన దీర్ఘ రోగులకు అది ఊరట కాదు. నిజానికి ప్రతిరోజూ ఆస్పత్రులకు వెళ్లే అవసరం కూడా ఉండదు. ఆ మాటకొస్తే బస్సుచార్జీల కంటె ఆటోలకు, ట్యాక్సీలకు పెట్టవలసిన ఖర్చు వారికి అధిక భారం అవుతుంటుంది. ప్రభుత్వం ఆలోచన బాగున్నది గానీ.. వారికి ఆస్పత్రులకు వెళ్లే సందర్భాలకు సంబంధించి.. రీఇంబర్స్ చేసుకునేలాగా.. ఆ డబ్బు అందజేస్తే సరిపోతుందేమో ఆలోచించాలి.

ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తానన్న హామీనే ఇంకా కార్యరూపంలోకి రాలేదు. ఈలోగా మళ్లీ మరో ఉచిత ప్రయాణం మాట చెబుతున్నారు. నిర్దిష్టంగా అమలు జరగాలంటే.. ప్రభుత్వం ఉచిత ప్రయాణం కాకుండా.. మరో రకంగా వారికి ఆ సాయం అందించే ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

8 Replies to “ఆలోచన మంచిదే గానీ.. అసంపూర్ణం, అపరిపక్వం!”

  1. Inka maaku, parajalake teliyadhu ee news . Appude parajala abhiprayam nee daggarki ela vachindhi Abba ? Deeni meedha Inka kommineni aavu vyasam kuda rayaledhu

  2. రేయ్ అన్నివేలమంది ప్రభుత్వం వద్ద నుండి రీయింబర్స్ చేసుకువడం అంత ఈజీ నా ..?? మళ్ళీ ఈ పద్దతి తెచ్చి ఈ డబ్బులు లేట్ ఐతే ఇంకో నాలుగు ఆర్టికల్స్ రాసి తిడదాం అనా ..??

  3. బాబు పేరు చెబితేనే అప్పు పుట్టడం లేదు.

    మేనిఫెస్టో చూస్తావుంటే భయం వేస్తుంది అంటున్నారు.

    లోకేష్, పవన ఏదడిగినా టైం కావాలి నేర్చుకుంటున్నాము, స్టడీ చెయ్యాలి అని చెబుతున్నారు. పేపర్ పులుల ఆర్భాటాలు తప్పించి పనులు ఎక్కడివక్కడ ఆపేశారు.

    ఇవ్వలేకపెన్షన్ లబ్ధిదారుల కోత.

    గ్యాస్ సీలిండర్లు అడిగితే మోడీ గుంతలో తన్నాడు.

    ఉచిత బస్సు వారానికొకసారి హాస్పిటల్ కి వెళ్లే రోగులకు మాత్రమేనట. దాని కోసం మళ్లీ స్టడీ చేస్తున్నాము అని కాలయాపన.

    మానిఫెస్టోల గురించి పట్టించుకోని, ఓట్ల తేడాలు గురించి పట్టించుకోని ఎలక్షన్ కమిషన్, సూపెర్మ్ కోర్ట్ ప్రజలకి అవసరమా…

    పోను పోను బీహార్ సంస్కృతీ మొత్తం ఇండియా వ్యాపించేలా కాప్ పంచాయతీలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ పచ్చ సన్నాసులు ఇసుకలా ప్రభుత్వ స్థలాలు బొక్కేస్తున్నారు.

    1. ఏదీ.. Leven చె’డ్డి గా0du ముక్కి, మూలుగుతూ 5 ఏళ్ల కి Pension 1000/- పెంచడం టపా టపా అమలు చేసినట్ట?

      బటన్ గా0డు జనవరి లో button నొక్కితె డిసెంబర్ లో పనిచేసేది

    2. మాట చెప్పినట్టు మోడీ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేదు కానీ, స్పీకర్ m*dda వంచి తనకి ప్రతిపక్ష హోదాని బిక్ష గా సాధించే దమ్మున్న 11 సింహం తెలుసా??

Comments are closed.