ఫిజిక్ ఓకే.. వాయిస్ సంగతేంటి?

తమ సినిమాలు, అందులో పాత్రల కోసం హీరోలు మేకోవర్ అవ్వడం సహజం. ఈ క్రమంలో గడ్డాలు, మీసాలు పెంచడం, శారీరకంగా కూడా బరువు పెరగడం లేదా తగ్గడం లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు సాయి దుర్గ…

తమ సినిమాలు, అందులో పాత్రల కోసం హీరోలు మేకోవర్ అవ్వడం సహజం. ఈ క్రమంలో గడ్డాలు, మీసాలు పెంచడం, శారీరకంగా కూడా బరువు పెరగడం లేదా తగ్గడం లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు సాయి దుర్గ తేజ్ (సాయిధరమ్ తేజ్ అని కూడా పిలుస్తారు) కూడా అదే పనిలో ఉన్నాడు.

రీసెంట్ గా ఓ ప్రచార కార్యక్రమానికి హాజరైన సాయి తేజ్ (సాయిధరమ్ తేజ్ ను ఇలా కూడా పిలుస్తారు) డిఫరెంట్ గా కనిపించాడు. ఫుల్లుగా గడ్డం, మీసాలు పెంచాడు. త్వరలోనే ఫిట్ గా కూడా మారబోతున్నాడు.

ఇదంతా అతడి కొత్త సినిమా కోసమే. వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందంట. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ కోసమే సాయితేజ్ ఇలా మేకోవర్ బాట పట్టాడు.

అంతా బాగానే ఉంది కానీ, మరి వాయిస్ సంగతేంటి? యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ గొంతులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని పదాలు, డైలాగ్స్ స్పష్టంగా పలకలేకపోతున్నాడు. విరూపాక్షలో అది కనిపించింది.

డిక్షన్ పరంగా కూడా తను ట్రయిన్ అవుతున్నానని, త్వరలోనే ఆ మార్పు కూడా చూస్తారని సాయిధరమ్ తేజ్ ఇదివరకే ప్రకటించాడు. కానీ తాజాగా హాజరైన ఓ ప్రచార కార్యక్రమంలో మాత్రం ఆయన గొంతు ఇంకా గాడిన పడలేదు. యాక్సిడెంట్ వల్ల ఏర్పడిన ఈ లోపాన్ని కూడా సాయితేజ్ త్వరలోనే అధిగమిస్తాడని ఆశిద్దాం.

5 Replies to “ఫిజిక్ ఓకే.. వాయిస్ సంగతేంటి?”

  1. జులై కం టే ఆగష్టులో 19,79, 086 పెన్షన్లు తగ్గిం చి ప్రభుత్వం. 

    ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసిం ది. గతం కం టే ఎక్కు వ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సం ఖ్య ను తగ్గిస్తూ వస్తోం ది. 

    గత నెల కం టే ఈనెల భారీగా పెన్షన్లు తగిపోయాయి. కాగా, జులైలో 65 లక్షల 18 వేల 496 మం దికి పెన్షన్లు పం పిణీ చేశారు. ఈ నెలకొచ్చే సరికి 45 లక్షల 39 వేల 41 మం దికి తగ్గిపోయిం ది.

Comments are closed.