తెలుగులోకి తమిళ ‘గరుడన్’

రీమేక్ చేయడం సులువేం కాదు కష్టమే అని మన దర్శకులు కొందరు చెబుతుంటారు కానీ అసలు సమస్య వేరు. క్రాఫ్ట్ నేర్చుకుంటారు. కానీ కంటెంట్ దొరకదు. కంటెంట్ దొరికితే , దాన్ని పట్టుకుని కథ…

రీమేక్ చేయడం సులువేం కాదు కష్టమే అని మన దర్శకులు కొందరు చెబుతుంటారు కానీ అసలు సమస్య వేరు. క్రాఫ్ట్ నేర్చుకుంటారు. కానీ కంటెంట్ దొరకదు. కంటెంట్ దొరికితే , దాన్ని పట్టుకుని కథ అల్లేసుకుని సినిమా చేసుకోవడం ఈజీ. అందుకే రీమేక్ ల వైపు మొగ్గు చూపుతారు. కానీ రీమేక్ చాలా కష్టం అనే కహానీలు కొందరు దర్శకులు చెబుతుంటారు.

సరే ఈ సంగతి అలా వుంచితే ఇటీవల తమిళలో గరుడన్ అనే సినిమా వచ్చింది. దాన్ని ఇప్పుడు తెలుగులో తీసే ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో వెట్రీమారన్ నిర్మించిన సినిమా ఇది. మూడు కీలక పాత్రలు. ఇద్దరు మిత్రులు ప్రధానంగా వుండే పాత్రలు. మూడు నెలల క్రితం తమిళంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో తీసే ప్రయత్నం మొదలైనట్లు తెలుస్తోంది.

రాధామోహన్ నిర్మాతగా, నాంది విజ‌య్ దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో వుంది. కీలకమైన మూడు పాత్రలకు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ను తీసుకునే ప్లానింగ్ లో వున్నారు. బెల్లంకొండ- నారా రొహిత్ ఇద్దరు మిత్రులుగా కనిపిస్తే, మంచు మనోజ్ విలన్ గా కనిపించే అవకాశం వుంది. పూర్తి వివరాలు మరి కొన్నాళ్లలో తెలుస్తాయి.

2 Replies to “తెలుగులోకి తమిళ ‘గరుడన్’”

Comments are closed.