రాజ్-లావణ్య కేసులో మలుపులు.. ఈరోజు హైకోర్టు ముందుకు!

లావణ్య ఆరోపణలపై మరోసారి స్పందించింది హీరోయిన్ మాల్వి మల్హోత్రా. లావణ్య ఆరోపిస్తున్నట్టు కోయంబత్తూరులోని మాధవ హోటల్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది. అదే విధంగా గ్రీన్ పార్క్ హోటల్ లో కూడా…

లావణ్య ఆరోపణలపై మరోసారి స్పందించింది హీరోయిన్ మాల్వి మల్హోత్రా. లావణ్య ఆరోపిస్తున్నట్టు కోయంబత్తూరులోని మాధవ హోటల్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది. అదే విధంగా గ్రీన్ పార్క్ హోటల్ లో కూడా తను లేదనని అంటోంది.

“లావణ్య ఆరోపిస్తున్నట్టు ఆ రోజుల్లో నేను షూటింగ్ లో ఉన్నాను. అప్పుడు నైట్ షూట్స్ జరిగాయి. ఒక్కోసారి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కాల్షీట్ ఉండేది. కొన్ని రోజులు రాత్రి-పగలు కూడా షూటింగ్స్ జరిగాయి. లావణ్య ఆరోపిస్తున్నట్టు నేను గ్రీన్ పార్క్ హోటల్ లో లేను. ఆ రోజుల్లో నేను వేరే హోటల్ లో ఉన్నాను. ఇలాంటి నిరాధార ఆరోపణలపై స్పందించడం నాకిష్టం లేదు.”

కోయంబత్తూరులోని మాధవ్ హోటల్ లో రాజ్-మాల్వి తరుచుగా కలుసుకునేవాళ్లని, రాత్రిళ్లు ఒకే గదిలో గడిపేవారనేది లావణ్య ఆరోపణ. వీటిని మాన్వి ఖండించింది. అంతేకాదు, మీడియాకు లావణ్య రిలీజ్ చేసిన వాట్సాప్ ఛాట్స్ కూడా అబద్ధం అంటోంది.

“మా బ్రదర్ తో చేసిన ఛాటింగ్ ను లావణ్య బయటపెట్టింది. అవన్నీ అబద్ధాలు. మా సోదరుడి ఫోన్ లో ఒరిజినల్ ఛాటింగ్ నేను చూశాను, లావణ్య బయటపెట్టిన స్క్రీన్ షాట్స్ కు, మా బ్రదర్ ఫోన్ లో ఉన్న ఛాటింగ్స్ కు అస్సలు పొంతన లేదు. ఇదే విషయం నేను పోలీసులకు కూడా చెప్పాను.”

చెప్పుతో కొట్టింది..

ఓవైపు లావణ్య-రాజ్-మాల్వి మధ్య.. ఇలా ట్రయింగులర్ వివాదాస్పద లవ్ స్టోరీ నడుస్తుండగా.. మరోవైపు సడెన్ గా సీన్ లోకి వచ్చిన శేఖర్ భాషా తనదైన విమర్శలతో దూసుకుపోతున్నాడు. తననుతాను రాజ్ తరుణ్ కు బెస్ట్ ఫ్రెండ్ గా చెప్పుకుంటున్న శేఖర్ భాషా.. ఇప్పటికే లావణ్యతో జరిపిన కాల్ సంభాషణను విడుదల చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆమె చేతిలో చెప్పుదెబ్బలు తిన్నాడు.

ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్ కు లావణ్య, శేఖర్ భాషా హాజరయ్యారు. లావణ్య చిన్న పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తోందంటూ ఆర్జే శేఖర్ భాషా ఆరోపించాడు. దీంతో లావణ్య సహనం కోల్పోయింది. చెప్పు తీసి ఆర్జేపైకి విసిరింది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో తనకు మద్దతుగా నిలిచిన శేఖర్ భాషాను, స్టేజ్ పైనే రాజ్ తరుణ్ గట్టిగా కౌగలించుకొని థ్యాంక్స్ చెప్పిన సంగతి తెలిసిందే.

రాజ్-లావణ్య వివాదంపై హైకోర్టు వ్యాఖ్యలు..

లావణ్య పెట్టిన కేసు ఆధారంగా హైదరాబాద్ నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇవ్వగా, రాజ్ తరుణ్ తన లాయర్ ను పంపించాడు. దీంతో ఏ క్షణానైనా రాజ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్, హైకోర్టును ఆశ్రయించాడు. తనను అరెస్ట్ చేయకుండా పోలీసుల్ని ఆదేశించాలని కోరాడు. రాజ్ తరుణ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేసుకు సంబంధించిన వివరాల్ని సమర్పించాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించింది. కేసును ఇవాళ్టికి వాయిదా వేసింది.

4 Replies to “రాజ్-లావణ్య కేసులో మలుపులు.. ఈరోజు హైకోర్టు ముందుకు!”

  1. ఏ న్యూస్ చూసినా ఏ మున్నది గర్వ కారణం

    నర జాతి సమస్తానికి నారీ మణు లే గమ్యం

    విజయశాంతిఅవంతికారామరాజబాబుల

    గోరంత మాధవీయతరుణీ వణ్యకావ్యం..

Comments are closed.