వడ్డించే వాడు మనవాడైనప్పుడు భోజనాల బంతిలో కూర్చుంటే చాలు, విస్తట్లో పిండివంటలు పడుతూనే ఉంటాయి.
ప్రభుత్వం మీడియాకి యాడ్స్ ఇవ్వాలి అన్న రూల్ ఏమో గానీ, ఒకటి కాదు రెండు కాదు లెక్కకు మించిన దినపత్రికలు, చానళ్లు భోజనాల బంతిలో కూర్చున్నట్టు కూర్చుంటున్నాయి.
వాటిలో ప్రజాదరణ ఉన్న దినపత్రికలేవో, లేనివేవో స్కూల్ పిల్లాడు కూడా చెప్పేస్తాడు. అయినాసరే, కొన్నిటికి అర్హత లేకపోయినా లక్షలు, కోట్లు కుమ్మరిస్తున్నాయి గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు.
చానల్స్ ని పక్కనపెట్టి కేవలం దినపత్రికలకి ప్రభుత్వ ప్రకటనలు ఏ రేంజులో అందాయో తెలుసుకుందాం. ఈ లెక్కలు ఊహాగానాలు కావు. అధికారికంగా వెలువడిన జాబితా.
ఇక చూడండి.
2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాములో ఐదేళ్లకు గాను ఈనాడుకి ముట్టజెప్పిన మొత్తం 122 కోట్లు. అంటే 2019-24 మధ్య జగన్ మోహన్ రెడ్డి హయాములో అంత ఇచ్చి ఉండడు అనుకుంటున్నారా? కాదు… రెట్టింపు ఇచ్చాడు… అంటే 243 కోట్లన్నమాట.
ఇక సాక్షికి చంద్రబాబు హయాములో ఇచ్చింది 31 కోట్లైతే, జగన్ పాలనలో ఇచ్చుకున్నది 371 కోట్లు.
ఈ రెండు పత్రికలూ సర్క్యులేషన్ విషయంలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
మూడో స్థానంలో ఉన్న పత్రిక ఆంధ్రజ్యోతి. బాబుగారి పరిపాలనలో ఈ పత్రికకి అందిన ప్రకటనల విలువ 72 కోట్లైతే, జగన్ పాలనలో అందింది 28 లక్షలు మాత్రమే!
చంద్రబాబు రెండవ స్థానంలో ఉన్న సాక్షికి 31 కోట్లిచ్చి, మూడవ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి 72 కోట్లిచ్చినా అడిగినవాడు లేడు. అడిగినా సమాధానం చెప్పేవాడు లేడు.
అలాగే జగన్ హయాములో మూడవ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి 28 లక్షలిచ్చి నాల్గవ, ఐదవ, ఆరవ స్థానాల్లో ఉన్న ఆంధ్ర ప్రభ, వార్త, ప్రజాశక్తి పేపర్లకి వరుసగా 16 కోట్లు, 15 కోట్లు, 13 కోట్లు ఇవ్వడం కూడా అర్ధం కాదు. అలాగే 7 వ స్థానంలో ఉన్న ఆంధ్రభూమికి 50 లక్షలిచ్చి, 8 వ స్థానంలో ఉన్న విశాలాంధ్రకి 2 కోట్లిచ్చింది జగన్ ప్రభుత్వం.
ఇదంటా ఏంటంటే..అంతే! పైన చెప్పుకున్నాం కదా.. వడ్డించే వాడు మనవాడైతే అని…
నెంబర్-1 పత్రికని పక్కన పెట్టి, ఏ పత్రికలైతే ఏలుతున్న వారి మనసులకి దగ్గరగా ఉంటాయో వాటికి వడ్డింపులు అవుతూనే ఉంటాయి.
ఇక్కడ సమస్యేమిటంటే ఈ డబ్బంతా ప్రజాధనం. పార్టీల డబ్బు కాదు. సొంత పార్టీ ఖజానా నుంచైతే ఎవరికి తోచింది వాళ్లు నచ్చిన వాళ్లకి పంచుకోవచ్చు. కానీ ప్రజాధనంతో ఈ ఆటలేంటి?
సరే వడ్డించడంలో న్యాయాన్యాయాలు పక్కన పెట్టి, అసలీ పత్రికల్ని ఎవరు చదువుతున్నారో ప్రశ్నించుకుంటే సమాధానం అందదు. మా పత్రికకి ఇంత సర్క్యులేషన్ ఉందని చెబితే ఆ లెక్కకి తగ్గట్టు యాడ్స్ ఇచ్చేస్తున్నారా లేక వాటితో ప్రమేయం లేకుండా ఇస్తున్నారా అనేది ఒక సందేహం.
ఉదాహరణకి చంద్రబాబు హయాములో “వార్త” దినపత్రికకి ఐదేళ్లల్లో 19.81 కోట్ల విలువైన యాడ్స్ ఇచ్చారు. “నేటి దినపత్రిక సూర్య” పత్రికకి 19.61 కోట్లు, ఆంధ్ర ప్రభకైతే 20 కోట్లు, ప్రజాశక్తికి 21 కోట్లు ప్రకటనలిచ్చారు. అంతేసి ప్రజాధనాన్ని ఆయా దినపత్రికలకి ఇవ్వడం ఎంత వరకు సమంజసం? అసలవి మార్కెట్లో ఉన్నాయా? వాటి సర్క్యులేషన్ ఎంతుంటుంది?
విశాలాంధ్ర పత్రికకి చంద్రబాబు 12 కోట్లు, జగన్ మోహన్ రెడ్డి 2 కోట్లు తమ పాలనలో ఇచ్చారు. అసలా పేపరు మార్కెట్లో ఎక్కడ కనిపిస్తోంది? ఎవరు చదువుతున్నారు?
“ఆంధ్రపత్రిక” అని దశాబ్దాల క్రితం ఉందని తెలుసు. కానీ చంద్రబాబు పాలనలో ఆ పేరుతో ఉన్న పత్రికకి 93 లక్షల రూపాయల ప్రకటనలు అందాయని జాబితాలో ఉంది. జగన్ పాలనలో ఈ పత్రిక లిస్టులో లేదు.
అన్నట్టు “నేటి దినపత్రిక సూర్య” కి 19.61 కోట్లు, “సూర్య” అనే పత్రికకి 24 లక్షలు చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చినట్టుంది. సూర్య పేరుతో రెండు దినపత్రికలు ఉన్నాయని ఎంతమందికి తెలుసో!
ఇవన్నీ కాక, ఇంగ్లీష్ పేపర్లకి కూడా ఘనంగా కోట్లల్లో ప్రకటనలిచ్చాయి ప్రభుత్వాలు. “ది హిందూ” కి బాబు గారు 28.75 కోట్లిస్తే, జగన్ గారు 52.22 కోట్లిచ్చారు. తెలుగు పత్రికలకంటే ఇంగ్లీష్ పేపర్లకి ఇచ్చిన ప్రకటనల విలువే ఎక్కువగా ఉంది జగన్ గారి పాలనలో. అలాగని బాబు గారు తక్కువిచ్చారని కాదు.
ఖర్చు పెట్టినందుకు కాదు…పెట్టిన ఖర్చుకి ఫలితమెంత అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.
ప్రభుత్వ స్కీములు, ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకి చేరవేస్తాయి కనుక పత్రికలకి యాడ్స్ ఇవ్వడం దశాబ్దాల క్రితం ఒక రివాజుగా మారింది. కానీ ఎన్నిటికని ఇవ్వాలి? ఎందుకివ్వాలి? నిజానికి ప్రభుత్వ ప్రకటనలు లేకపోతే చాలా పత్రికలు మూసుకుపోతాయి. అలా మూసుకుపోవడం వల్ల ప్రజలేమీ గగ్గోలు పెట్టరు. ఎందుకంటే అలాంటి పత్రికలున్నాయని కూడా చాలామంది ప్రజలకు తెలియదు. ప్రధాన పత్రికల ద్వారా చేరాల్సిన వార్తలు వాళ్లని చేరుతూనే ఉన్నాయి.
అయినా సరే వేలాది కోట్లు ఇలా పత్రికలకి ధారపోయడం ప్రజాధనాన్ని వృధా చేయడమే.
ఇక్కడితో ఆగిపోలేదు. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ హోర్డింగులుంటాయి. అవి కొన్ని ప్రైవేట్ సంస్థలచేత లీజుకి తీసుకోబడి ఉంటాయి. వాటి మీద కూడా ప్రభుత్వ ప్రకటనలిచ్చి కోట్లు కుమ్మరిస్తాయి ప్రభుత్వాలు. రోడ్ మీద హోర్డింగ్ చూసి విషయం తెలుసుకునే పరిస్థితిలో ఇప్పుడు ప్రజలున్నారా? ఈ డిజిటల్ యుగంలో ప్రతీదీ మొబైల్ ఫోనులోనే తెలుసుకుంటున్నారు. యూట్యూబ్, వాట్సాప్ తెలియని ప్రజలు లేరు. వార్తలన్నీ వాళ్లకి ఎక్కువగా అక్కడే తెలుస్తున్నాయి ప్రింట్ పేపర్లకన్నా, హోర్డింగులకన్నా. అలాంటప్పుడు ప్రింట్ పేపర్లకి అన్నేసి కోట్లు ఎందుకివ్వాలనే ప్రశ్న తలెత్తదా? అసలివ్వద్దని కాదు, ఇప్పుడు ఇస్తున్నంత అవసరమా అని.
ఈ వడ్డింపుల్లో కొందరికి కిక్ బ్యాక్స్ రూపంలో లంచాలందుతాయని ఒక ఓపెన్ సీక్రెట్ ఉంది. లేకపోతే ఐ అండ్ పీ ఆర్ కమీషనర్ అనబడే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంత సంపాదిస్తే హైదరాబాదులోని మోకిలాలో ఇండిపెండెంట్ బిల్డింగ్ సొంతం చేసుకోగలుగుతాడు? ఎవరు నిగ్గదీసి అడుగుతారు?
ప్రజాధనం దుర్వినియోగం అని ఆ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎగస్పార్టీ దుయ్యబట్టడం కాదు. ముందు ఇలా వృధాగా పోతున్న ప్రజాధనానికి అడ్డుకట్ట వేస్తే ఆదర్శనీయులుగా చరిత్రకెక్కొచ్చు.
అరె కుయ్య, వాళ్ళిద్దరినీ కలి పేయాలి అని చూస్తున్నావ్.. యాక్చీ మా-డారె-డ్డిగాడి paper, ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి CBN గారి papers కావు!! convenient గా ఈనాడు యాక్చి 1 , 2 అన్నావ్ కానీ ఈనాడు highest circulated paper మరి మా-డా-రె-డ్డిగాడు ఎందుకు సగం కన్నా తక్కువ ఇచ్చాడు?? అసలు యాక్చి ని న్యూస్ పేపర్ అని ఎవరన్నా అంటారా??
కొంచెం కూడా సిగ్గులేకుండా ప్రజల డబ్బుతో ….మన news paper ను VOLUNTEERS తో కొనిపించాలి అనే నీచమైన ఆలోచన మాత్రం దేశంలో యే పార్టీ కూడా చేసి వుండదు GA….. మీరు తప్ప….🙏🙏
గురివింద గింజ కి దాని గువ్వ కింద నలుపు కనపడదంట .అంధ్ర ప్రదేష్ డిజిటల్ కార్పొరేషన్ నుండి నువ్వు ఎంత మింగావ్ యాడ్స్ కి ?
does this mean neither KCR nor Revanth gave a single rupee all these years? How much government allocated for Sakshi in Telangana?
మీరు ప్రకటనలు ఎ పత్రికకి ఇవ్వలి అన్నా, అందులొ కచ్చితంగా అత్యదిక సర్కులెషన్ ఉన్న ప్రత్రికకి అయితె ఇవ్వలిసిందె! ఈ నియమమె ఈనాడుని కాపడుతూ వస్తుంది. సాక్షి కి ఇవ్వలి అన్నా ఈనాడుకు కూడా ఇవాలి.
సర్కులెషన్ పెంచుకొని మొదటి సానం లొకి సాక్షి ని తెచ్చి, ఈనాడుకు ఎగనాము పెడదాము అని జగన్ ఎంతొ ప్రయత్నించాడు. అందుకె వాలెంటీర్లకి సాక్షి కొనుకొటానికి పన్నుల డబ్బు ఇవ్వటానికి కూడా జగన్ వెలుకాడలెదు. ఇంత చెసినా ఆ సన్నసి పత్రికని మొదటి స్తానం లొ పెట్టలెక పొయాడు.
ఈనాడుకు కి ప్రత్యెకం గా ఎవరూ చెసింది ఎమి లెదు. అత్యదిక సెర్కులషన్ ఉన్న పత్రికగా ఎ పత్రికి ప్రకటనలు ఇవ్వాలి అన్నా… ఈనాడు కి కూడా ఇవ్వాల్సిన నియమం ఉంది.
పతకాల లబ్దిదారుల కంటే ముందే అసలైన లబ్దిదారు సాక్షి కి వేల కోట్లు లబ్ది.
Button నోక్కబోతున్నా అంటూ Ads ఇస్తు, బటన్ నొక్కక ముందే 3000 కోట్లు బొక్కిన సాక్షి..
Why cannot they create 2-3posts in each dept, recruit contract employees and reach out to ppl? Ill-literate anyway cannot read news papers. Or pumpin messages to mobile phones without links. This way the 4th estate affiliation to parties can be cut. But no, they need a reason for kickbacks and this is one among many.
పతకాల లబ్దిదారుల కంటే ముందే అసలైన లబ్దిదారు సాక్షి కి వేల కోట్లు లబ్ది.
Button నోక్కబోతున్నా అంటూ Ads ఇస్తు, బటన్ నొక్కక ముందే 3000 కోట్లు బొక్కిన సాక్షి..
The official eenadu circulation on avg is 16.14L per day as officially declared by ABC. They sell 59crs papers in 365 days with avg cost if 5rs. It tallies to 300crs and out if which govt. ad revenue for years 14-19 wad 249crs per annum. Its for your interpretation who owns & who runs.
సమాజంలో నీ ఓటు తెచ్చిన మార్పు.. పెన్షన్ కోసం వృద్ధుల మరణాలు లేవు.. శవ రాజకీయం లేదు… సచివాలయాల్లో, బ్యాంకుల్లో పడిగాపులు లేవు.. పెన్షన్లను అడ్డు పెట్టుకుని, రాజకీయం చేసి, వృద్ధులని చంపేసి, శవ రాజకీయం చేసింది నాటి జగన్ రెడ్డి ప్రభుత్వం. నేడు కూటమి ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. సమర్ధవంతమైన పాలన మాత్రమే కనిపిస్తుంది. కేవలం నాలుగు గంటల్లోనే రాష్ట్రంలో 80% పెన్షన్ల పంపిణీ సాఫీగా జరిగిపోయింది. ఎక్కడా దివ్యాంగులతో రాజకీయం, వృద్ధులతో శవ రాజకీయం లేదు. ఒక అసమర్ధుడు చేసే శవ రాజకీయానికి, ఒక సమర్ధుడు చేసే పరిపాలనకి తేడా, నేడు జరుగుతున్న పెన్షన్ల పంపిణీ. #PensionsPandugaInAP #NTRBharosaPension #NaraChandrababuNaidu #AndhraPradesh https://manatdp.org/feedview/5823/0
ఆ పాపం లో నీ వాటా ఎంత గ్రేట్ ఆంధ్ర?
పాపం ఏ రెడ్డిని అడగాలో తెలీక బిల్లు పెట్టలేదు….
ఇప్పుడు సాక్షి 6 వ స్థానం లో వుంది అని ఎక్కడో విన్నా /చదివా
Ido neeku 2019 2024 madya gurtu raledha raddam ani. How sad and pity on u
వార్నీ….GA లో కూడా ఒక జర్నలిస్టు ఉన్నాడ్రోయ్….
ముడ్డి తుడుచుకునే పెంట పత్రికకు (అసాక్షి) ప్రకటనలు ఎందుకు బొక్క !
ము డ్డి తుడుచుకునే పెం ట పత్రికకు (అసాక్షి) ప్రకటనలు ఎందుకు బొ క్క !
orey burra thakkuva vedhava sakshi paper and channels 1st or 2nd place lo undiraa mee andhrajyothi paper tho muddu thuduchuko