దేవర Vs పుష్ప-2.. ఇదో రకం పోటీ

బడా సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీపడడం కామన్. కానీ దేవర, పుష్ప-2 సినిమాలు మాత్రం లీకుల పరంగా పోటీ పడుతున్నాయి. ఒక రోజు ఈ సినిమా నుంచి లీక్ వస్తే, మరుసటి రోజు ఆ…

బడా సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీపడడం కామన్. కానీ దేవర, పుష్ప-2 సినిమాలు మాత్రం లీకుల పరంగా పోటీ పడుతున్నాయి. ఒక రోజు ఈ సినిమా నుంచి లీక్ వస్తే, మరుసటి రోజు ఆ సినిమా నుంచి లీకులు.

మొన్నటికిమొన్న దేవర సినిమా నుంచి ఎన్టీఆర్ లుక్ ఒకటి లీక్ అయింది. ఆల్రెడీ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజైనప్పటికీ, ఈ లుక్ ఇంకాస్త డిఫరెంట్ గా ఉంది. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు, అంతలోనే అది డిలీట్ అయింది.

అది జరిగి 2 రోజులైనా కాకముందే పుష్ప-2 నుంచి యాక్షన్ సీన్ ఒకటి లీక్ అయింది. ఇందులో అల్లు అర్జున్ వెనక నుంచి కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నడవకపోయినా వీడియో లీక్ అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇప్పుడు దీనికి పోటీగా దేవర నుంచి జాన్వి కపూర్ ఫొటోలు కొన్ని లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, జాన్వి మధ్య ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి జాన్వికపూర్ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

ఇలా మినిమం గ్యాప్స్ లో లీకులతో దేవర, పుష్ప-2 సినిమాలు పోటీ పడుతున్నాయి. నిజానికి ఈ రెండు సినిమాలు చాన్నాళ్లుగా లీకులతో ఇబ్బంది పడుతున్నాయి. కానీ ఔట్ డోర్ షూట్స్ కావడం వల్ల మేకర్స్ ఏం చేయలేకపోతున్నారు.

దేవర పార్ట్-1 సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. ఇక పుష్ప పార్ట్-2 డిసెంబర్ 6న రిలీజ్ కానుంది.

One Reply to “దేవర Vs పుష్ప-2.. ఇదో రకం పోటీ”

Comments are closed.