కల్కి-2 మరింత ఆలస్యం?

కల్కి సినిమా వచ్చే ఏడాది ఈ టైమ్ కు రిలీజ్ అయిపోతుందంటూ ఈమధ్య ప్రకటించేశారు నిర్మాత అశ్వనీదత్. అదే టైమ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. కల్కి-2 కోసం మరిన్ని ప్రపంచాలు సృష్టించబోతున్నానని..…

కల్కి సినిమా వచ్చే ఏడాది ఈ టైమ్ కు రిలీజ్ అయిపోతుందంటూ ఈమధ్య ప్రకటించేశారు నిర్మాత అశ్వనీదత్. అదే టైమ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. కల్కి-2 కోసం మరిన్ని ప్రపంచాలు సృష్టించబోతున్నానని.. సినిమా ఎప్పటికి పూర్తవుతుందనే విషయాన్ని అప్పుడే చెప్పలేనని క్లియర్ గా చెప్పేశాడు.

ఇప్పుడిదంతా ఎందుకుంటే, అశ్వనీదత్, నాగ్ అశ్విన్ చెప్పిన గడువు కంటే, కల్కి-2 ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీనికి కారణం హీరోయిన్ దీపిక పదుకోన్.

కల్కి సినిమా సెట్స్ పై ఉంటుండగానే దీపిక పదుకోన్ గర్భం దాల్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది. సో.. కల్కి-2 షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చాలామంది అనుకోవచ్చు. కానీ అసలు చిక్కు ఇక్కడే ఉంది.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కనీసం ఏడాదిపాటు గ్యాప్ తీసుకోవాలని భావిస్తోందంట దీపిక పదుకోన్. దీని కోసం ఆమె తనకెంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును కూడా కాదనుకుంది. వచ్చే ఏడాది జూన్ నుంచి సినిమా స్టార్ట్ చేస్తామని, జులై నుంచి కాల్షీట్లు ఇస్తే సరిపోతుందని రోహిత్ శెట్టి చెప్పినప్పటికీ, దీపిక పదుకోన్ తిరస్కరించినట్టు వార్తలొస్తున్నాయి.

ఇదే క్రమంలో ఆమె ఓ పాపులర్ షో సీజన్-3కి కూడా నో చెప్పిందంట. ఇవన్నీ చూస్తుంటే, ఆమె కల్కి-2 షూటింగ్ కు కూడా దూరమయ్యేలా ఉంది.

సంక్రాంతి తర్వాత కల్కి-2ను సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఇటు చూస్తే, సినిమా మొత్తం దీపిక పాత్ర చుట్టూనే తిరుగుతోంది. ఆమె ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.

One Reply to “కల్కి-2 మరింత ఆలస్యం?”

Comments are closed.