అన్ని సినిమాల అప్ డేట్స్ ఒకేసారి!

ఓ పెద్ద సినిమా అప్ డేట్ వచ్చిందంటే, మరో పెద్ద సినిమా అప్ డేట్ వెంటనే రాదు. కానీ తమన్ మాత్రం అన్ని అప్ డేట్స్ ఒకేసారి ఇచ్చేశాడు. తను చేస్తున్న పెద్ద ప్రాజెక్టుల…

ఓ పెద్ద సినిమా అప్ డేట్ వచ్చిందంటే, మరో పెద్ద సినిమా అప్ డేట్ వెంటనే రాదు. కానీ తమన్ మాత్రం అన్ని అప్ డేట్స్ ఒకేసారి ఇచ్చేశాడు. తను చేస్తున్న పెద్ద ప్రాజెక్టుల వివరాలన్నింటినీ వన్ బై వన్ బయటపెట్టాడు.

ముందుగా గేమ్ ఛేంజర్ విషయానికొద్దాం.. ఈ సినిమా అప్ డేట్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు మెగాభిమానులు. ఫస్ట్ సింగిల్ తర్వాత మళ్లీ చప్పుడు చేయలేదు. ఈ నెలలో మరో పాట వచ్చేలా ఉందని ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి మూవీ అప్ డేట్ ఉంటుందని ప్రకటించాడు తమన్.

ఇక పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీపై కూడా చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు సుజీత్ తో కలిసి, ఓ ప్రమోషనల్ కంటెంట్ తయారుచేస్తున్నాడట. త్వరలోనే అది రిలీజ్ అవుతుందంటున్నాడు. అయితే అది ఏంటనేది చెప్పలేదు.

మరో పెద్ద సినిమా రాజాసాబ్ అప్ డేట్ కూడా ఇచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమా గ్లింప్స్ రిలీజైంది. అదే ఊపులో సాంగ్ రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే జనవరి నుంచి మాత్రమే పాటల ప్రచారం ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు తమన్.

బాలకృష్ణతో చేస్తున్న సినిమాపై కూడా చిన్న అప్ డేట్ ఇచ్చాడు. సినిమాకు సంబంధించి కొన్ని రషెష్ చూశాడట. అభిమానులకు పండగ లాంటి సినిమా వస్తోందంటూ ఊరిస్తున్నాడు. ఇలా తను వర్క్ చేస్తున్న సినిమాలకు సంబంధించి తనకు అందుబాటులో ఉన్న అప్ డేట్స్ అందించాడు తమన్.

2 Replies to “అన్ని సినిమాల అప్ డేట్స్ ఒకేసారి!”

Comments are closed.