సత్తిబాబు సత్తా చూపాల్సిందేనా?

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ పోస్టుకు ఉప ఎన్నికల నగారా మోగింది. ఆగస్ట్ 30న ఎన్నిక జరుగుతుంది. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఈ ఎన్నికలు అధికార టీడీపీ కూటమికి అలాగే కొత్తగా విపక్షంలోకి…

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ పోస్టుకు ఉప ఎన్నికల నగారా మోగింది. ఆగస్ట్ 30న ఎన్నిక జరుగుతుంది. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఈ ఎన్నికలు అధికార టీడీపీ కూటమికి అలాగే కొత్తగా విపక్షంలోకి వచ్చిన వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.

దాని కంటే ఎక్కువగా వైసీపీకి ఈ ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయని చెప్పాలి. ఈ సీటు వైసీపీది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలోకి వెళ్ళడంతో అనర్హత వేటు పడింది. అలా ఏర్పడిన ఖాళీతో వచ్చిన ఉప ఎన్నికలు ఇవి.

విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థలలో వైసీపీకే పూర్తి మెజారిటీ ఉంది. మొత్తం ఓట్లు 830 గా ఉంటే అందులో 615 వైసీపీ వారివే. టీడీపీ కూటమికి కేవలం 215 ఓట్లు ఉన్నాయి. రెండు పార్టీల మధ్య నాలుగు వందల ఓట్ల భారీ తేడా ఉంది. అయితే ఫిరాయింపులు ప్రలోభాలకు తెర తీసే ఉప ఎన్నికలు కావడంతో వైసీపీ అన్ని విధాలుగా ఆలోచించి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్ధిగా ఎంపిక చేసింది అని అంటున్నారు.

ఈ ఉప ఎన్నికలతో క్యాంప్ రాజకీయాలు మొదలవుతాయి. నామినేషన్ల విత్ డ్రా నుంచి పోలింగ్ జరిగే వరకూ పదిహేను రోజుల పాటు తమ పార్టీ ప్రజా ప్రతినిధులను కాపాడుకోవడం వైసీపీకి అతి పెద్ద సవాల్. అన్ని రకాలుగా బలమైన నేత అని ఎంచి బొత్సకు ఈ అవకాశాన్ని ఇచ్చారు అని అంటున్నారు.

బొత్స తన రాజకీయ వ్యూహాలతో చాతుర్యంతో ఈ సీటు గెలిస్తే మరో మూడున్నరేళ్ల పాటు చట్ట సభలలో ఉండొచ్చు. వైసీపీలో ఉత్తరాంధ్రాకు ఆయనే కింగ్ గా మారుతారు. తన ఇమేజ్ తో పాటు పార్టీ ఇమేజ్ ని ఆయన నిలబెట్టిన హీరో అవుతారు. రాజకీయంగా చూస్తే ఉత్తరాంధ్రలో కురు వృద్ధుడిగా బొత్సను అభివర్ణిస్తారు.

అటువంటి బొత్స సత్తిబాబు తన సత్తాను చూపించాల్సిన సమయం ఇపుడు ఆసన్నం అయింది అని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ లో ప్రస్తుతం వైసీపీలో ఎన్నో పదవులు చేపట్టి ఉత్తరాంధ్రలో తన కత్తికి ఎదురులేదని పించుకున్న సత్తిబాబు ఇపుడు ఏం చేయబోతున్నారు అన్నదే అంతా చూస్తున్నారు. సత్తిబాబు మీద జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సీటు గెలిపించుకుని వస్తే భారీ పరాజయంతో కునారిల్లిన వైసీపీకి వేయి ఏనుగుల బలం వస్తుంది అని అంటున్నారు.

10 Replies to “సత్తిబాబు సత్తా చూపాల్సిందేనా?”

  1. ఎస్సీ వర్గీకరణ కి అనుకూలమో వ్యతిరేకమో కూడా నోరు తెరిచి చెప్పలేని దద్దమ్మ గాడు.. జగన్ రెడ్డి.

    మళ్ళీ వీడికి ప్రతిపక్ష హోదా కావాలంట .. దరిద్రుడు..

    1. ఏంటండీ మీరు అసలే మన అన్న మొన్న ప్రజాదర్బార్ నిర్వహించి అలసిపోతే …పెపంచికం లో వంద జరుగుతుంటాయి….ఎం జరిగిన మన అన్న కె లాభం టీడీపీ కె బొక్క….ఇదే మా స్టాండర్డ్ ఆన్సర్ …అస్తమానం అడక్కండి…

    2. already supreme court theerpu ichhina tharvatha inka verevalla opinion tho panemi unutundi…intha balam unnaa prathyeka hoda gurinchi adagaleni goppa sthithi lo unnaru meeru….daniki santhoshapaduthunnatlunnaru !!

  2. బొత్స గెలిస్తే YCP కి వేయి ఏనుగుల బలం వస్తుంది నిజమే…… TDP కి ఎంత తలనొప్పో వాళ్ళకి తెలియదా?

    ఒకవేళ బొత్స గెలిస్తే tdp కి రాజకీయం చేతకానట్లే…..

  3. తుప్పసెదవా ..పురాణాల్ని బ్రష్టు పట్టించకు మొన్నటి దాక అన్న ని అర్జునుడు అన్నావ్…ఇప్పుడు బొత్స ని కురు వృద్ధు అంటున్నవ్….కనీసం 70 కూడా దాటని వ్యక్తికీ అంత పెద్ద పోలిక ఏమిటి…రాను రాను మతి మండిపోతున్నట్టు ఉంది

  4. ఎక్కువా ఎలేవేషన్స్ ఇచ్చెయ్యద్దు …2024 చివరలో కాంగ్రెస్ కానీ పుంజుకునే సూచనా కనపడింది అంటే మాత్రం ఉత్తరాంధ్ర వైసీపీ మొత్తాన్ని చీల్చి కాంగ్రెస్ వైపు నడుస్తాడు…మల్ల అప్పుడు ఇవన్నీ తవ్వి తీస్తే కష్టం

  5. బొచ్చు సత్తి గాడిని భలి పశువును చేసి, ఓడిస్తే .. ఆడి రాజకీయ జీవితం ఘోరమైన ముగింపునకు వస్తుందని… Jeggulu గాడు అదే కోరుకుంటున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.

Comments are closed.