పార్ల‌మెంట్‌కు అవినాష్ వెళ్ల‌రా?

పార్ల‌మెంట్‌కు క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెళ్ల‌రా? అంటే… పెద్ద‌గా వెళ్ల‌ర‌నే స‌మాధానం వ‌స్తోంది. పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న‌ప్పుడు కూడా ఆయ‌న క‌డ‌ప‌లోనో, హైద‌రాబాద్‌లోనో అవినాష్‌రెడ్డి క‌నిపిస్తున్నారు. 2014లో వైఎస్ అవినాష్‌రెడ్డి క‌డ‌ప ఎంపీగా…

పార్ల‌మెంట్‌కు క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెళ్ల‌రా? అంటే… పెద్ద‌గా వెళ్ల‌ర‌నే స‌మాధానం వ‌స్తోంది. పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న‌ప్పుడు కూడా ఆయ‌న క‌డ‌ప‌లోనో, హైద‌రాబాద్‌లోనో అవినాష్‌రెడ్డి క‌నిపిస్తున్నారు. 2014లో వైఎస్ అవినాష్‌రెడ్డి క‌డ‌ప ఎంపీగా మొద‌టిసారి గెలుపొందారు. ఆ స‌మ‌యంలో వైసీపీ త‌ర‌పున మొత్తం 8 మంది పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. ముగ్గురు ఎంపీలు టీడీపీలో చేరారు.

ఆ త‌ర్వాత 2019లో వైసీపీ త‌ర‌పున 22 మంది లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. వీరిలో ర‌ఘురామ‌కృష్ణంరాజు వైసీపీతో విభేదించి, ఆ పార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడ్డం తెలిసిందే. ఆ స‌మ‌యంలో ఎక్కువ మంది ఎంపీలు ఉండ‌డం వ‌ల్ల అవినాష్‌రెడ్డి లోక్‌సభ స‌మావేశాల‌కు వెళ్ల‌క‌పోయినా పార్టీకి పెద్ద‌గా న‌ష్టమ‌నిపించ‌లేదు. అయితే ఇప్పటి ప‌రిస్థితి వేరు.

కేవ‌లం న‌లుగురు మాత్ర‌మే వైసీపీ త‌ర‌పున గెలుపొందారు. వీరిలో క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ఒక‌రు. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ సోద‌రుడిగా అవినాష్‌రెడ్డి పార్టీ బాధ్య‌త‌ల్ని భుజాన వేసుకోక‌పోతే ఎలా అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్ల‌మెంట్‌లో లేవనెత్తాల్సిన స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయి. ఆ ప‌ని చేయ‌కుండా క‌డ‌ప‌కే ప‌రిమితం కావ‌డం ఏంట‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

ఇప్ప‌టికైనా అవినాష్‌రెడ్డి పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు రెగ్యుల‌ర్‌గా హాజ‌రై క‌నీసం త‌న పార్ల‌మెంట్ ప‌రిధిలోని స‌మ‌స్య‌ల గురించి లోక్‌స‌భ‌లో ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం వుంది. లోక్‌స‌భ‌కు వెళ్ల‌నందుకు అవినాష్‌రెడ్డిని ఎందుకు ఎన్నుకోవాల‌నే ఆలోచ‌న పార్ల‌మెంట్ ప్ర‌జ‌ల్లో రాక‌ముందే ఆయ‌న త‌న వైఖ‌రి మార్చుకోవాలి.

18 Replies to “పార్ల‌మెంట్‌కు అవినాష్ వెళ్ల‌రా?”

  1. గొప్పోళ్ళు రా బాబు ..ఒకడు అసెంబ్లీ కి రాడు ఇంకోడు పార్లమెంట్ కి పోడు….

  2. ఆయన ఎక్కడికి పోడు సిబిఐ వాళ్ళు వస్తే నే వాళ్ళ అమ్మ ని పంపించాడు హాస్పిటల్ కి అని నెటిజనులు సెటైర్ లు వేస్తున్నారు

  3. RED BOOK కల్లోకొచ్చి “ల0గా Leven” మాటి మాటికి బెంగళూరు కి పారిపోతూ ఉంటే, తాడేపల్లి సరసాల కి అనుకూలంగా ఉంది. So ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ వదిలేసి పార్లమెంటు అంటాdenti ఈడు??

  4. ‘RED BOOK కల్లోకొచ్చి “ల0గా Leven” మాటిమాటికి బెంగళూరు కి ‘పారిపోతూ ఉంటే, తాడేపల్లి సరసాలకి అనుకూలంగా ఉంది. S0 ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ వదిలేసి పార్లమెంటు అ0టాdenti ఈడు??

  5. ఒకడు అసెంబ్లీ వెళ్ళాడు .. మరొకడు లోక్ సభకి వెళ్ళాడు .. వీళ్ళు మల్లి ప్రజా స్వామ్యము అని నీతులు చెప్తారు ..

Comments are closed.