2018లో కేరళ భయంకరమైన వరదలతో ఇక్కట్లు పడింది. నాటి వరదల్లో సుమారు 400 మంది ప్రాణాలను కోల్పోయారని అధికారిక గణాంకాలు చెబుతూ ఉన్నాయి. మరెంతో ఆస్తినష్టం జరిగింది. అందమైన కేరళ ఇప్పుడు మరోసారి విలయంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ సారి ప్రధానంగా వయనాడ్ బాధిత స్థానంలో కనిపిస్తోంది. వయనాడ్ లో జరిగింది సులభంగానే అర్థం అవుతుంది. వరద నీరు ఊళ్ల మీదకు వచ్చాయి. ఇళ్లను చుట్టుముట్టేసే వరదలు ఒకరకమైనవి. అవి ప్రధానంగా ఆస్తులకు నష్టం చేకూరుస్తాయి.
అయితే వయనాడ్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన వరదలు అలాంటివి కావు. ఇవి ఇళ్లను కూడా తమ వెంట తీసుకెళ్లిపోయాయి. లేదంటే తాము తెచ్చిన మట్టితో ఊళ్లను ఊళ్లనే ముంచేశాయి. తప్పించుకోవడానికి మనుషులకు ఎలాంటి అవకాశం ఇవ్వనంత హఠాత్ వరదలు ఇవి. వేసవిలో కూడా కేరళలో పుష్కలమైన వర్షాలు కురుస్తూ ఉంటాయి. సగటున 300 సెంటీమీటర్ల వర్షం కురిసే రాష్ట్రం అది! ఏపీ వంటి చోట అయితే ఏడాదిలో 30 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయితేనే.. అది అత్యంత భారీ వర్షపాతం నమోదైన సంవత్సరం అనుకోవచ్చు. అలాంటిది 300 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యే రాష్ట్రం అంటే కేరళకు వర్షం ఇప్పటి వరకూ ఎన్ని పాఠాలు నేర్పి ఉంటుందో అంచనా వేసుకోవచ్చు!
అయినప్పటికీ కేరళ వర్షపాతాలకు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది. వరదలు, ఇలాంటి విలయాలు.. కేరళను భయాందోళనల్లో ముంచెత్తుతూ ఉన్నాయి. అయితే కేరళకు వర్షపాతం కొత్తకాకపోయినా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండటానికి కారణం మాత్రం.. అడవులను విపరీతంగా నరికివేస్తూ ఉండటమే అనేది సూటిగా స్పష్టంగా అర్థం అవుతున్న అంశం.
కేరళ ప్రధానంగా అయితే వలసల మీద లేకపోతే టూరిజం మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ ఉంది. కేరళ నుంచి ప్రపంచం నలుమూలలకూ వలసలు ఉంటాయి. ఊళ్లలో ఉన్న వారి కంటే.. ఆ రాష్ట్రం అవతల ఏదో ఒక పని చేసుకుంటూ బతికే వారే కేరళ జనాభాలో ఎక్కువగా ఉంటారేమో! కనీసం ఇరవై ముప్పై సంవత్సరాలు కేరళ అవతలే పనిచేసి తిరిగి వచ్చి సొంత రాష్ట్రంలో సెటిలయ్యామనే వయోవృద్ధుల సంఖ్య కేరళలో చాలా ఉంటుంది.
గల్ఫ్ దేశాలకు అయినా, పొరుగు రాష్ట్రాలకు అయినా కేరళ ప్రజలు విపరీతంగా వెళ్తారు. అక్కడ ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటారు, వ్యవసాయాలు చేసుకోవడానికి భూ విస్తీర్ణం బాగా తక్కువ. ఎక్కువ భాగం అటవీ భూమి, పర్వతాలు కావడంతో వలసలు కేరళకు ఆది నుంచి అలవాటే. అయితే అడవులను నరకడం బాగా పెరిగింది అన్ని చోట్ల వలే. పర్యాటకాన్ని ప్రోత్సాహించడానికి అంటూ ప్రభుత్వాలు కూడా అక్కడ ఈ పరిస్థితిని పట్టించుకోవడం లేదు.
అటవీ ప్రాంతంలో గెస్ట్ హౌస్ లు నిర్మించడానికి, ప్రకృతి మధ్యన రిసార్ట్ లు అంటూ ఎడాపెడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కేరళలో! ఇబ్బంది రానంత వరకూ వాటితో ప్రమాదం లేదు. అయితే ప్రకృతి తనదైన శైలిలో స్పందించినప్పుడు ఇలాంటి పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి. అంత వరకూ అంతా అందంగా కనిపించినది ఇలా భయంకరంగా మారుతుంది. తక్కువ నీరు పారుతున్నప్పుడు సెలయేరుల మధ్యన ఆ పరిసరాలు చాలా బాగున్నాయి. అయితే ఆ వంకలు ఉధృతి తీవ్రం అయ్యింది, నీటి ప్రవహం నివాసాల మీదకు వచ్చింది, నిర్దయగా మొత్తాన్నీ తన వెంట తీసుకెళ్లిపోయాయి.
కేరళను పర్యాటకం దృష్టితో చూడటం కంటే, ప్రకృతి దృష్టితో చూసి.. సెన్సిటివ్ ఏరియాగా భావించి చాలా భూభాగంలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకపోవడం మంచిదని, కేరళలోనే కాకుండా.. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ ల వరకూ విస్తరించిన పడమటి కనుమల్లో ఏకంగా 75 శాతం పర్వత-భూభాగాన్ని వదిలివేయాలని వివిధ అధ్యయనాలు చాలా యేళ్ల కిందటే సూచించాయి.
వాటిని నిర్మాణాలు, అభివృద్ధి అంటూ టచ్ చేయడం చాలా రకాలుగా ప్రమాదకరం అని ఆ కమిటీలు తమ అధ్యయనాల ద్వారా తేల్చి చెప్పాయి. అయితే ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడం లేదు. మనిషి జీవనోపాధి, ఆదాయం, పర్యాటకం అంటూ ఎడాపెడా నిర్మాణాలు సాగుతూ వచ్చాయి, సాగుతున్నాయి. వాటి ఫలితాలు అప్పుడప్పుడు ఇలా ఆ ప్రాంతాన్నే బాధితంగా మారుస్తూ ఉన్నాయి.
ఏటి ఒడ్డున ఎలా ఇళ్లు కడతారు అనేది మనిషి ఆలోచించుకోవాల్సిన విషయం. కొండ కింద నిర్మాణం ఎలా చేపట్టాలనే ఆలోచన వస్తుంది? అది అందం కోసం అయినా, ఇంక వేరే మార్గం లేక అలాంటి నిర్మాణం చేపట్టినా.. బాగున్నంత వరకూ అంతా బాగానే ఉంటుంది. కానీ తేడా వస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇది మనిషి చాలా సూక్ష్మంగా గ్రహించాల్సిన అంశం. కానీ.. ప్రకృతిని తక్కువ అంచనా వేయడం అలవాటుగా మారుతూ ఉంది. దీంతో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఒక ప్రాంతాన్ని చూసి అయినా మరో ప్రాంతం అలర్ట్ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటిది ఏ ఐదారేళ్లకో జరుగుతూ ఉంటుంది. కొన్నాళ్లకు అంతా మరిచిపోతారు, ఇలాంటి సంఘటనల్లో మనుషుల ఎమోషన్ల గురించి సినిమాలు వస్తాయి, అయితే ప్రకృతి ఎమోషన్ ను మాత్రం మనిషి పట్టించుకోడు! వాస్తవానికి అదే అసలు పాఠం!
మహర్షి తాత కింద పేరు వేసుకో
ఋషి కొండ..
అవునా భం భం భ్రమరావతి బురద రొచ్చు లో కూరుకు పోతావ్ కొడకో బారుచేతులోడా 😜 హైదరాబాద్ ఐఐటి వారు వద్దంటే ఆగుతాడా సింగపూర్ సింహాలను రప్పిస్తాడు చంబల్ నక్క 🦊
వాక్కాయ కొత్తిమీర వెల్లుల్లి కారం
కళాయి పెట్టుకుని ఆయిల్ వేసి మినపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి పచ్చి మిర్చి వేసి వేపాలి
మిక్సీ గిన్నెలో వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసి వేయించుకోవాలి
చల్లారి పెట్టి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి
తర్వాతవాక్కాయ వేసుకొని వేయించాలి
అందులోనే ఉప్పు వేసుకోవాలి అన్నీ కలిపి మిక్సీ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మళ్లీ కడాయి తీసుకుని తాలింపు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వేసి తాలింపు పెట్టుకోవాలి
తాలింపు చల్లారిన తర్వాత రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ మెంతిపిండి ఒక స్పూన్ ఆవపిండి వేసి కలుపుకొని
వాక్కాయ కొత్తిమీర పచ్చడి ఇందులో కలుపుకోవాలి అంతే వాక్కాయ కొత్తిమీర వెల్లుల్లి కారం
రెడీ ఇది సీజనల్ ఫుడ్ ఆగస్టు సెప్టెంబర్ లో మాత్రమేవాక్కాయ దొరుకుతుంది
వాక్కాయ కిడ్నీలకు బాగా పనిచేస్తది
లివర్ కి బాగా పనిచేస్తుంది గట్ హెల్త్ బాగా పని చేస్తది కళ్ళకి బాగా పనిచేస్తది సి విటమిన్ చాలా ఎక్కువ కళ్ళకు మంచిది
ఆరుగుదల బాగుంటది
నువ్వు ఎంత బిర్యాని తిన్నా
నా యొక్క ఆకలి తీరునా
సునామీకి బినామీని
పెడాతాను అంటే కుదురునా
ee mukka anna ki kooda cheppudalsindi .. Rishikonda bodi gundu atappi 500 kotlu migilevi
ఋషికొండ కి ఏం కాదురా ఎర్ర ఎంగళప్పా బురద భ్రమరావతి మరో వాయ్నాడ్ అవుతదని హైదరాబాద్ ఐఐటి వారు సెలవు ఇచ్చారు