ఈ హీరో సినిమా కంటెంట్ వస్తే ఇంకో హీరో ఫ్యాన్స్… ఆ హీరో కంటెంట్ వస్తే ఈ హీరో ఫ్యాన్స్ ఇలా ట్రోలింగ్ చేయడం అన్నది టాలీవుడ్ లో కామన్. అందుకే కంటెంట్ వదిలే ముందే చాలా కట్టుదిట్టంగా చూసుకోవాల్సి వుంటుంది. అందులోనూ భారీ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేసినపుడు ప్రతి కంటెంట్ పూల్ ప్రూఫ్ గా వుండాలి. లేదంటే ట్రోలింగ్ సర్రున లేస్తుంది.
దేవర సినిమా భారీ పాన్ ఇండియా సినిమా. ఎన్టీఆర్ సినిమా. అలాంటి సినిమా సెకెండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ వదులుతున్నపుడు ఎంత జాగ్రత్తగా వుండాలి. దాని మీద వర్క్ ఎంత పెర్ ఫెక్ట్ గా వుండాలి. అలా లేకపోవడంతో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త దిగాలు పడాల్సి వచ్చింది. పోస్టర్ అంతా బాగుంది. కానీ దానికి చేసిన వర్క్ లో చిన్న చిన్న తేడాలే. అది కూడా టెక్నికల్ గా చేసిన వర్క్ లో.
పోస్టర్ లో హీరోయిన్ కాలు కవర్ అయిపోవడం, హీరోయిన్ చేతుల మీద నరాలు తేలినట్లు కనిపించడం, హీరో పిక్ మీద జరిగినంత వర్క్ హీరోయిన్ మీద జరగకపోవడం వల్ల ఈ ట్రోలింగ్ వచ్చింది. ఈ సంగతి పక్కన పెడితే హీరో ఎన్టీఆర్ లుక్ బాగుంది. హ్యాండ్ సమ్ గా వున్నాడు. పాట బయటకు వస్తే ఈ ట్రోలింగ్ వుండదు. పాట బాగుంటే సినిమా మీద్ బజ్ మరింత లేస్తుంది. అనిరుధ్ పాట ఎలా ఇచ్చాడు అన్నది చూడాలి. తొలి పాట పాస్ అయింది. మలి పాట కూడా పాస్ అయిపోతే అనిరుధ్ సినిమాకు న్యాయం చేసేసినట్లే. ఎందుకంటే అనిరుధ్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ దగ్గర పెద్దగా సందేహాలు వుండవు.
ఇకనైనా వదిలే పోస్టర్ల టెక్నికల్ వర్క్ విషయంలో యూనిట్ జాగ్రత్తగా వుండాలి. నెటిజన్లు పిన్ పాయింట్ గా చూస్తారని గుర్తుంచుకోవాలి. లేదూ అంటే ఈ ట్రోలింగ్ ను తిప్పి కొట్టడానికి ఫ్యాన్స్ కిందా మీదా పడాల్సి వుంటుంది.
నీ ఏడుపే కాని పోస్టర్ బాగుంది
Nee yedupeee maa edhugudhala
No buzz . These days people are not waiting for new movies
జనం పట్టించుకోరు
orey waste fellow neeku indi tappa inko statement raada
Call boy works 8341510897