బొత్తిగా కలిసిరాని వివాదం

లావణ్యతో వివాదం తెరపైకి వచ్చిన వెంటనే రాజ్ తరుణ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకోకపోయినా, సోషల్ మీడియా మాత్రం రాజ్-లావణ్య వివాదాన్ని భుజానికెత్తుకుంది. Advertisement రాజ్…

లావణ్యతో వివాదం తెరపైకి వచ్చిన వెంటనే రాజ్ తరుణ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకోకపోయినా, సోషల్ మీడియా మాత్రం రాజ్-లావణ్య వివాదాన్ని భుజానికెత్తుకుంది.

రాజ్ తరుణ్ కు ఇది ఇబ్బందికరమే అయినప్పటికీ.. అతడి సినిమాలకు మంచి మైలేజీ వస్తుందని అంతా అనుకున్నారు. మరీ ముఖ్యంగా అతడితో సినిమాలు తీసిన నిర్మాతలు లోలోపల హైప్ వచ్చినందుకు ఆనందించి ఉంటారు. కానీ రాజ్ తరుణ్ వివాదం, అతడి సినిమాలకు బొత్తిగా కలిసిరాలేదు.

కొన్ని రోజుల కిందట పురుషోత్తముడు సినిమా రిలీజైంది. భారీ ప్యాడింగ్ తో వచ్చిన ఆ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక మొత్తం వివాదానికి కేంద్ర బిందువైన తిరగబడరాసామీ సినిమా కూడా థియేటర్లలోకి వచ్చింది.

రాజ్-మాల్వి కనెక్ట్ అయింది ఈ సినిమాతోనే. లావణ్యకు చిర్రెత్తుకొచ్చింది కూడా ఈ సినిమా మూలంగానే. అలా భారీ ఎటెన్షన్ మధ్య రిలీజైందీ మూవీ. కంటెంట్ సంగతి పక్కనపెడితే, కనీసం సినిమాలో రాజ్-మాల్వి జంటను చూసేందుకైనా జనం ఎగబడతారని కొంతమంది ఊహించారు. కానీ అలాంటిదేం జరగలేదు.

తిరగబడరసామీ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ కంటే, నెగెటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. సినిమాలో అలరించే అంశాల కంటే, బోర్ కొట్టించే ఎలిమెంట్స్ ఎక్కువయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంగతి పక్కనపెడితే, మూవీకి ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ రాలేదు.

దీంతో రాజ్ తరుణ్ నిజజీవిత వివాదం ఈ సినిమాకు ఏమాత్రం కలిసి రాలేదనే విషయం స్పష్టమైంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించాడు.

8 Replies to “బొత్తిగా కలిసిరాని వివాదం”

    1. కెరీర్ వరకు ఉదయ్ కిరణ్ లాగ అయ్యాడంటే పర్లేదు, అతని లాగ తీవ్రమైన నిర్ణయం తీసుకోవద్దని ఆశిద్దాం

  1. అంటే ఇదంతా publicity కోసం వాళ్లిద్దరూ చేసారని అందరికీ తెలిసిపోయిందా???

Comments are closed.