కార్య‌క‌ర్త‌ల‌కు బాబు ప్ర‌త్యేక ప్రాధాన్యం!

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలా కేడ‌ర్‌ను విస్మ‌రిస్తే, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చాలా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయినా కేడ‌ర్ అండ వుంటే, మ‌ళ్లీ పుంజుకోవ‌చ్చ‌నేది బాబు ఆలోచ‌న‌. అందుకే ఆయ‌న…

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలా కేడ‌ర్‌ను విస్మ‌రిస్తే, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చాలా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయినా కేడ‌ర్ అండ వుంటే, మ‌ళ్లీ పుంజుకోవ‌చ్చ‌నేది బాబు ఆలోచ‌న‌. అందుకే ఆయ‌న ప‌దేప‌దే త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని, ద్వితీయ శ్రేణి నాయ‌కుల్ని క‌లుసుకోడానికి స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి చంద్ర‌బాబునాయుడు వెళ్ల‌డం విశేషం. కార్యాలయంలో కార్య‌క‌ర్త‌లు, సామాన్య ప్ర‌జ‌ల నుంచి ఆయ‌న విన‌తిప‌త్రాలు స్వీక‌రించారు. మొద‌ట‌గా ఆయ‌న దివ్యాంగుల నుంచి అర్జీలు స్వీక‌రించ‌డం ద్వారా వారికి ప్ర‌త్యేక గుర్తింపు ఇచ్చిన‌ట్టైంది. దివ్యాంగుల‌కు రూ.6వేలు పింఛ‌న్ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి అర్జీని క్షుణ్ణంగా త‌నిఖీ చేసి ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పారు.

చంద్ర‌బాబే కాకుండా త‌న స‌హ‌చ‌ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల్ని కూడా నిత్యం టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి వెళ్లి విన‌తిప‌త్రాలు స్వీక‌రించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ప్ర‌జ‌ల‌కు, కేడ‌ర్‌కు ద‌గ్గ‌ర‌గా వుండాల‌నే ఎత్తుగ‌డ‌లో భాగంగానే ప్ర‌భుత్వం ఇలాంటివ‌న్నీ చేస్తోంది.

ప్ర‌జ‌లైనా, కార్య‌క‌ర్త‌లైనా మొద‌ట కోరుకునేది త‌మ‌తో మాట్లాడాల‌ని. ఈ ప‌ని జ‌గ‌న్ హ‌యాంలో జ‌ర‌గ‌లేదు. అందుకే ల‌క్ష‌ల కోట్లు ప్ర‌జ‌ల‌కు పంచామ‌ని జ‌గ‌న్ చెబుతున్న‌ప్ప‌టికీ, వారికి దూరం కావ‌డం వ‌ల్లే ఎన్నిక‌ల్లో చావు దెబ్బ తినాల్సి వ‌చ్చింది. ఆ త‌ప్పు నుంచి టీడీపీ గుణ‌పాఠం నేర్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

5 Replies to “కార్య‌క‌ర్త‌ల‌కు బాబు ప్ర‌త్యేక ప్రాధాన్యం!”

Comments are closed.