ఫిజికల్ కరెన్సీకి ప్రత్యామ్నాయం అని చెబితే చాలా మంది నవ్వారు. ఇంత టెక్నాలజీ ఇండియాకు పనికిరాదన్నారు. అసలు ఎంతమంది దీన్ని వాడగలరు అనే ప్రశ్న లేవనెత్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడో దొరికేశాయి. దేశంలో యూపీఐ పేమెంట్స్ ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి.
గడిచిన నెల జులైలో యూపీఐ పేమెంట్లు రికార్డ్ సృష్టించాయి. మొత్తంగా 1444 కోట్ల లావాదేవీలు జరగ్గా.. వీటి ద్వారా 20.64 లక్షల కోట్ల రూపాయలు ఒక ఎకౌంట్ నుంచి మరో ఎకౌంట్ కు బదిలీ అయ్యాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం, 20 లక్షల కోట్ల రూపాయలు దాటి యూపీఐ పేమెంట్స్ జరగడం.. ఈ ఏడాది వరుసగా ఇది మూడోసారి. మే, జూన్ నెలల్లో కూడా ఈ మార్క్ అందుకున్నాయి యూపీఐ పేమెంట్స్.
గతేడాది జులై నెలలో యూపీఐ ద్వారా 9964 కోట్ల రూపాయల పేమెంట్స్ జరగ్గా.. ఈ ఏడాది జులై నాటికి ఆ పేమెంట్స్ విలువ 45 శాతం పెరిగింది. దీంతో దేశంలో ప్రజలు యూపీఐ పేమెంట్స్ కు ఎంత వేగంగా అలవాటు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
దేశంలో యూపీఐ పేమెంట్స్ వాడకం విపరీతంగా పెరిగినట్టు ఎన్పీసీఐ వెల్లడించింది. ప్రతి వంద లావాదేవీల్లో 80 యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయట. ఎక్కువమంది వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే మాత్రమే వాడుతున్నారని తేల్చిన ఎన్పీసీఐ.. ఈ రెండు ఫ్లాట్ ఫామ్స్ ద్వారానే 86శాతం లావాదేవీలు జరుగుతున్నట్టు తెలిపింది.
కరెన్సీరహిత లావాదేవీల్లో గడిచిన మూడేళ్లలో క్రెడిట్ కార్డు వినియోగం రెట్టింపు అయింది. అదే సమయంలో డెబిట్ కార్డు వాడకం 43 శాతం పడిపోయింది. 2022 డేటా ప్రకారం చూసుకుంటే, ప్రపంచంలో జరిగిన లావాదేవీల్లో 46శాతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఒక్క ఇండియాలోనే జరుగుతున్నాయి.
Good, hope eventually helps to minimize black money in the economy and increase the tax base from businesses and people.