ఏపీ ప్రజానీకం సూపర్ సిక్స్ పథకాల అమలు ఎప్పుడా? అని ఎదురు చూస్తోంది. పింఛన్ల పెంపు మాత్రం చెప్పిన సమయానికి అమలు చేసి చంద్రబాబు శభాష్ అనిపించుకున్నారు. మిగిలిన ఆర్థికపరమైన అంశాలపై కూటమి ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందన్న విమర్శల్ని మూటకట్టుకుంటోంది.
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తోంది. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి ఉచిత ప్రయాణంపై త్వరలో అని చెప్పడం ఊతపదంగా మారిందన్న వ్యంగ్య కామెంట్ వినిపిస్తోంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మొదలు, ఆయన ఇదే మాట చెబుతున్నారు.
తాజాగా చిత్తూరులో మూడు ఆర్టీసీ డిపోలకు చెందిన 17 కొత్త బస్సుల్ని రాంప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందుకోసం పొరుగు రాష్ట్రాల్లో ఉచిత సౌకర్యాన్ని అధ్యయం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మన రాష్ట్రంలో కూడా అమలుకు శ్రీకారం చుడతామని మంత్రి తెలిపారు.
ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టడంతోపాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల అందించడం కోసమే కొత్త బస్సులు తెస్తున్నామన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలు, భూముల దందాపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
2021 డిసెంబర్ కి పోలవరం కంప్లీట్ చేస్తాం .. we are commited to it …
పోలవరం చాల కంప్లికేటెడ్ అది ఎవరికీ అర్ధం కాదు … ఎందుకు అంటే నాకు అర్ధం కాలేదు కాబ్బటి . .